చాక్లెట్‌..గుండెకు మేలు

Chocolate

Advertisements

&NewLine;<p>డార్క్‌ చాక్లెట్‌ రక్తపోటు తగ్గటానికి తోడ్పడుతున్నట్టు&comma; గుండెకు మేలు చేస్తున్నట్టు గత అధ్యయనాల్లో వెల్లడైంది&period; అయితే ఇదెలా జరుగుతుందోననేది మాత్రం తెలియదు&period; ఇప్పుడు శాస్త్రవేత్తలు ఇందులోని గుట్టును ఛేదించారు&period; కోకో గింజల్లోని పీచు మన పేగుల్లో ఎలా పులుస్తుందో&comma; ఎలా మేలు చేస్తుందో గుర్తించారు&period; మన పేగుల్లో హానికర బ్యాక్టీరియాతో పాటు మంచి బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా&period; బైఫైడోబ్యాక్టీరియం&comma; లాక్టిక్‌ యాసిడ్‌ బ్యాక్టీరియా వంటి మేలు చేసే సూక్ష్మక్రిములు చాక్లెట్‌ను ఆహారంగా తీసుకొని&period;&period; దాన్ని పులియబెడుతున్నట్టు తేలింది&period; అనంతరం అందులోంచి వాపు నివారక రసాయనాలను ఉత్పత్తి చేస్తున్నట్టు బయటపడింది&period; సహజ సిద్ధంగా పుట్టుకొచ్చిన ఈ వాపు నివారక రసాయనాలు రక్తంలో కలిసి గుండె కణజాలం&comma; రక్తనాళాలు దెబ్బతినకుండా కాపాడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు&period; ఫలితంగా దీర్ఘకాలంలో రక్తపోటు ముప్పు తగ్గుతుందన్నమాట&period; కోకో గింజల్లో క్యాటెచిన్‌&comma; ఎపిక్యాటెచిన్‌ వంటి ఫాలీఫెనాల్స్‌తో పాటు కొద్దిమొత్తంలో పీచూ ఉంటుంది&period; నిజానికి ఈ ఫాలీఫెనాల్స్‌ ఆలస్యంగా జీర్ణమవుతాయి&period; కానీ పెద్దపేగులోని మంచి బ్యాక్టీరియా పీచును పులిసేలా చేసి&comma; ఫాలీఫెనాల్స్‌ను త్వరగా చిన్న చిన్న అణువులుగా మారుస్తోందని పరిశోధకులు చెబుతున్నారు&period; ఈ డార్క్‌ చాక్లెట్‌కు దానిమ్మ వంటి పండ్లు కూడా తోడైతే మరింత మంచి ఫలితం కనబడుతుందని వివరిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్‌లో ఘనంగా రన్నర్స్ సన్మాన కార్యక్రమం..

ఒకే విద్యార్థినిని నాలుగుసార్లు కరిచిన ఎలుక..

ఢిల్లీని మించిపోయేలా హైదరాబాద్ కాలుష్యం