చెరువు అభివృద్ధి పనుల్లో నాణ్యతా లోపం..

pond

Advertisements

&NewLine;<p>చెరువుల అభివృద్ధికోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృతనరోవర్ పథకంలో భాగంగా పార్వతీపురం పట్టణం కొత్తవలన దుర్గమ్మ కోనేరు అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఈ పనుల్లో నాణ్యతలోపం కన్పిస్తుందని టిడిపి పార్వతీపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనెల విజయచంద్ర ఆరోపించారు&period; గురువారం కొత్తవలన దుర్గమ్మ కోనేరు అభివృద్ధి పనులను ఆయనతోపాటు టిడిపి నాయకులు&comma; కౌన్సిల్ సభ్యులు&comma; కార్యకర్తలు పరిశీలించారు&period; ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ కోనేరు గట్టుపై నిర్మాణం చేపడుతున్న రోడ్డు కేవలం బూడిదతో కూడిన నాశిరకమైన గ్రావెల్ మాత్రమే అని&comma; సైడు వేసిన సిమెంట్ దిమ్మలు కూడా నాణ్యతలోపమే నాణ్యమైన మెటీరియల్ కాదన్నారు&period; ఈ కోనేరు అభివృద్ధికోసం రూ&period;94లక్షల నిధులు మంజూరయ్యాయని ఈ నిధులను దుర్వినియోగం చేయడానికి మాత్రం తూతూ మంత్రంగా అభివృద్ధి పనులు చేపడుతున్నారని ఆరోపించారు&period; ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులపై తక్షణమే విచారణ జరిపించాలని ఉన్నతాధికారులను కోరతామన్నారు&period; మున్సిపల్ కమిషనర్ను కూడా సంప్రదిం చడం జరుగుతుందన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.

ఫిన్‌లాండ్‌లో తెలంగాణకి చెందిన విద్యార్థి మిస్సింగ్.

విజయవాడలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ యాదవ్.