చైనా వైఖరిని నిరసిస్తూ తేజు పట్టణంలో విద్యార్థులు నిరసన

china and arunachal pradesh

Advertisements

&NewLine;<p>చైనా వైఖరి పట్ల అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు రగిలిపోతున్నారు&period; ఏషియన్ గేమ్స్ 2023 ను చైనా నిర్వహిస్తుండడం తెలిసిందే&period; అరుణాచల్ ప్రదేశ్ నుంచి హాజరు కావాల్సిన భారత అథ్లెట్ల విషయంలో చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శించడం వివాదానికి దారితీసింది&period; అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన అథ్లెట్లు నైమన్ వాంగ్సు&comma; ఒనిలు తేగ&comma; మెపంగ్ లమ్గ్ ఏషియన్ గేమ్స్ లో పాల్గొనాల్సి ఉంది&period; వీరిలో ఇద్దరికి స్టాపుల్డ్ వీసాలను చైనా మంజూరు చేసింది&period; వీరికి అక్రెడిటేషన్ ఇవ్వలేదు&period; మరో అధ్లెట్ కు అక్రిడిటేషన్ ఇచ్చింది&period; చైనా వైఖరికి నిరసనగా వీరు ముగ్గురూ ఏషియన్ గేమ్స్ కు దూరంగా ఉన్నారు&period;<br>ఈ క్రమంలో చైనా వైఖరిని నిరసిస్తూ తేజు పట్టణంలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు&period; అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో&comma; ఆల్ అరుణాచల్ ప్రదేశ్ యూత్ ఆర్గనైజేషన్&comma; స్థానిక విద్యార్థి సంఘాలు సంయుక్తంగా పట్టణంలో పెద్ద ర్యాలీ నిర్వహించాయి&period; పలు విద్యాలయాలకు చెందిన 300కు పైగా విద్యార్థులు ఇందులో పాల్గొన్నారు&period; క్లాక్ టవర్ నుంచి గాంధీ చౌక్ వరకు ఇది కొనసాగింది&period; ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ దిష్టి బొమ్మను నిరసనకారులు తగలబెట్టారు&period; ముగ్గురు అథ్లెట్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.