78
నెల్లూరు జిల్లా కందుకూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జగనన్నకు చెబుదాం కార్యక్రమం నిర్వహించారు. కందుకూరు డివిజన్ పరిధిలో ఉన్న భూ సమస్యలు పై బాధిత ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ హరినారాయణన్ నేరుగా ప్రజల నుండి సమస్యలు అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో వారి సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరి నారాయణన్ తో పాటు జాయింట్ కలెక్టర్ కుర్మానాధ్, సబ్ కలెక్టర్ శోభిక, జెడ్ పి సీఈవో చిరంజీవితో పాటు డివిజన్ స్థాయి అధికారులు మండల అధికారులు పాల్గొన్నారు.