119
టీడీపీ కాదు.. జనసేన మా భాగస్వామ్య పార్టీ అని, పరస్పర లాభాలు ఉంటేనే పొత్తులు ఉంటాయని రాజ్యసభ సభ్యుడు, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ స్పష్టంచేశారు. ఇవాళ ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తారని, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పవన్ స్ట్రాటజీ వల్లే గెలిచామన్నారు. పొత్తుల్లో కొన్ని సీట్లు ఇతర పార్టీలకు ఇవ్వాల్సి ఉంటుందని, రాష్ట్ర ప్రయోజనాలే కాదు, దేశ ప్రయోజనాలు కూడా చూస్తామని తెలిపారు. నేతలు పార్టీ వీడినంత మాత్రాన మాకు నష్టం లేదని తేల్చిచెప్పారు. తెలంగాణలో ఎందుకు పోటీ నుంచి విరమించుకుందో టీడీపీ చెప్పాలని డిమాండ్ చేశారు. టీడీపీ ఇప్పటి వరకు ఎక్కడ కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నామని చెప్పలేదని అభిప్రాయపడ్డారు.