తాజాగా మరో ఎల్పీజీ భారీ నౌక భారత్‌కు చేరింది..

Advertisements

<p>పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి&period; చమురు&comma; గ్యాస్‌ రిఫైనరీలే లక్ష్యంగా దాడులు&comma; హర్మూజ్‌ జలసంధిలో నౌకలు నిలిచిపోవడంతో ఆ ప్రభావం మనదేశంపైనా పడింది&period; ఐతే క్రమక్రమంగా ఎల్‌పీజీ కష్టాలకు బ్రేక్ పడుతోంది&period; తాజాగా మరో ఎల్పీజీ భారీ నౌక భారత్‌కు చేరింది&period;&period; అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీని తీసుకువస్తున్న ఒక కార్గో నౌక కర్ణాటకలోని న్యూ మంగళూరు పోర్టుకు విజయవంతంగా చేరుకుంది&period; పిక్సిస్ పయనీర్ నౌక 16 వేల 714 టన్నుల ఎల్పీజీని మోసుకొని మంగళూరు పోర్టుకు చేరుకుంది&period; వచ్చే వారంలో ఇంకా 72 వేల 700 టన్నుల ఎల్పీజీ రానుంది&period; ఈనెల 25à°¨ 26వేల 687 టన్నుల ఎల్పీజీతో అపోలో ఓషన్&period;&period;ఈనెల 29à°¨ 30 వేల టన్నుల ఎల్పీజీతో మరో నౌక భారత్‌కు చేరనుంది&period; అంతే కాదు&period;&period;గల్ఫ్ ప్రాంతంలోని భారతీయ నౌకలు&comma; నావికులందరూ సురక్షితంగా ఉన్నారని ప్రభుత్వం స్పష్టం చేసింది&period; వ్యూహాత్మకంగా ముఖ్యమైన హోర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వాణిజ్య మార్గాలకు అంతరాయం ఏర్పడిన టైమ్‌లో నౌక భారత్‌కు చేరడం గర్వకారణంగా చెబుతున్నారు&period; ఈ సంక్షోభ సమయంలో ఇంధన సరఫరాలను నిర్ధారించడానికి&comma; షిప్పింగ్ మంత్రిత్వ శాఖ మార్చి 14 నుంచి 31 వరకు ముడి చమురు&comma; ఎల్పీజీపై కార్గో ఛార్జీల మాఫీని సైతం ప్రకటించడం బిగ్ రిలీఫ్‌గా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.