తెలంగాణలో నేడు పర్యటించనున్న ప్రియాంక గాంధీ

Priyanka Gandhi

Advertisements

&NewLine;<p>తెలంగాణ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రధాన రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు&period; మొదటగా కొత్త జిల్లా అయిన నారాయణ పేట్ జిల్లాలోని దేవరకద్రకు ప్రియాంక గాంధీ మధ్యాహ్నం చేరుకుంటారు&period; అక్కడ మహిళలతో సమావేశమై టీపీసీసీ ప్రకటించిన ప్రధాన మేనిఫెస్టో ఆరు గ్యారంటీల ప్రచారం చేయనున్నారు&period; తర్వాత సాయంత్రం వనపర్తి జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో పాలమూరు ప్రజా భేరీ సభలో ప్రసంగించనున్నారు&period; ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ప్రధానంగా రాష్ట్రం చూపు మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గం పైనే ఉంది&period; మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో పాలమూరు ప్రజా భేరీ బహిరంగ సభ జరగనుంది&period; గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు జూపల్లి కృష్ణారావు&period; కాంగ్రెస్ లో గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి తర్వాత బీఆర్ఎస్ లో చేరగా&period;&period;కొన్ని విభేదాల వల్ల జూపల్లి కృష్ణారావు ఈమధ్య బీఆర్ఎస్ కు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు&period; &period; గతంలో రెండు సార్లు వాయిదా పడ్డ ప్రియాంక గాంధీ పర్యటనను ఈసారి విజయవంతం చేయాలని చూస్తుననారు&period; పాలమూరు ప్రజాభేరి సభలో కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి పేరును అధికారింగా ప్రకటించనున్నారు ప్రియాంక గాంధీ&period; తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత ప్రియాంక గాంధీ పర్యటించడం ఇది రెండోసారి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

కొండా సురేఖకు బుజ్జగింపులు.

ఫసల్ బీమా యోజన అమలుపై పాయల్ శంకర్ నిరసన.

తెలంగాణలో ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై నిషేధం.