తెలంగాణలో ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై నిషేధం.

Advertisements

<p>తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది&period; రాష్ట్రంలో అనలాగ్‌&comma; నాన్‌ డెయిరీ&comma; ఆర్టిఫిషియల్‌ పనీర్‌పై ఏడాది పాటు నిషేధం విధించింది&period; ప్రజారోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీజీ సేఫ్‌ వెల్లడించింది&period; ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది&period; రాష్ట్రవ్యాప్తంగా నిషేధం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది&period;<&sol;p>&NewLine;<p>పనీర్‌ పేరుతో అనలాగ్‌&comma; నాన్‌ డెయిరీ&comma; ఆర్టిఫిషియల్‌ ఉత్పత్తుల తయారీపై టీజీ సేఫ్‌ నిషేధం విధించింది&period; తయారీతో పాటు ప్రాసెసింగ్‌&comma; ప్యాకింగ్‌&comma; నిల్వ&comma; పంపిణీ&comma; రవాణా&comma; విక్రయాలపైనా ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపింది&period; ప్రజలకు నాణ్యమైన&comma; సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది&period;<&sol;p>&NewLine;<p>సెప్టెంబర్‌ 10à°µ తేదీ నుంచే నిషేధం అమల్లోకి వచ్చినట్లు టీజీ సేఫ్‌ వెల్లడించింది&period; ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌-2006లోని సెక్షన్‌ 30&lpar;2&rpar;&lpar;a&rpar; కింద ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది&period; ఏడాది పాటు రాష్ట్రవ్యాప్తంగా ఈ నిషేధం కొనసాగనుంది&period; ఆర్టిఫిషియల్‌ పనీర్‌ విక్రయాలు&comma; సరఫరాపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉండటంతో వ్యాపార వర్గాల్లోనూ ఈ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మండాడి’ని బ్లాక్ బస్టర్ హిట్ చేసిన తెలుగు ఆడియెన్స్‌కి థాంక్స్..

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.