ఏపీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.

Advertisements

<p>ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులు&comma; పింఛనుదారులకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది&period; రెండు డీఏలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది&period; పెంచిన డీఏలను సెప్టెంబరు నెల జీతంతో కలిపి చెల్లించాలని ఆదేశించింది&period; 2025 జనవరి 1 నుంచి 1&period;82 శాతం డీఏను&comma; 2024 జులై 1 నుంచి 2&period;73 శాతం డీఏను అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు&period;<&sol;p>&NewLine;<p>2025 జనవరి నుంచి అమలు కానున్న 1&period;82 శాతం డీఏకు సంబంధించిన 20 నెలల బకాయిలను 2028లో నాలుగు విడతల్లో చెల్లించనున్నారు&period; జనవరి&comma; మార్చి&comma; మే&comma; జులై నెలల్లో ఈ బకాయిలను ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నారు&period; అలాగే 2024 జులై నుంచి అమలు కానున్న 2&period;73 శాతం డీఏకు సంబంధించిన 26 నెలల బకాయిలను 2027లో నాలుగు విడతల్లో చెల్లించనున్నారు&period;<&sol;p>&NewLine;<p>2027లో ఏప్రిల్‌&comma; జూన్‌&comma; ఆగస్టు&comma; అక్టోబరు నెలల్లో 2&period;73 శాతం డీఏ బకాయిలను చెల్లించనున్నట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది&period; పింఛనుదారులకు కూడా ఇదే షెడ్యూల్‌ ప్రకారం డీఏ బకాయిలు చెల్లించాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పియూష్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు&period; దీంతో ఉద్యోగులు&comma; పింఛనుదారులకు సెప్టెంబరు జీతంతోనే పెరిగిన డీఏ ప్రయోజనం అందనుంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

నడ్డాకు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు.

మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో మోదీ భేటీ.

ఏడేళ్ల తరువాత భారత్ కు చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.