భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల…బూటకపు ప్రజాస్వామ్య అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించిన ప్రజలకు విప్లవాభివందనాలు మా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ 5 రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు విధానసభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లో తొలి విడుత నవంబర్ 7నాడు జరిగిన ఎన్నికలలో మా ఉద్యమ ప్రాంతాలలోని మెజార్టీ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. మధ్య రీజినల్ బ్యూర్ అభినందిస్తున్నది. ఉద్యమ ప్రాంతాలలో ఒకటైన బీజాపుర్ నియోజికవర్గం లో కేవలం 41 శాతం పోలింగ్ మాత్రమే జరిగి దాదాపు 59 శాతం ప్రజలు ఎన్నికలను బహిష్కరించి వాటి బూటకత్వాన్ని ఎండగట్టారు. ఛత్తీస్ గఢ్ లో విధానసభ ఎన్నికలు రెండు విడుతలుగా జరుపుతున్నారు. తొలి విడుత పోలింగ్ జరిగిన 20 నియోజికవర్గాలు మా ఉద్యమ ప్రాంతంలోనే వుండడంతో వీటిలో 1-2 చోట్ల మినహా ఎక్కడా 50-60 శాతానికి మించి పోలింగ్ జరుగలేదు. మా ప్రాంతాలలోని ప్రజలు తాము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటున్న విప్లవ ప్రజా కమిటీ (జనన సర్కార్)లపైనే మరోమారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలలో భయోత్పాతాన్ని సృష్టించడానికి పెద్ద ఎత్తున అదనపు అదనపు భద్రతా బలగాలను దించారు. ఇప్పటికే వేలాది సంఖ్యలో అడుగడుగున తుపాకులు ధరించిన ఖాకీలతో అడవులు నిండిపోగా, మరిన్ని అదనపు బలగాలను తెచ్చి మొహరించినప్పటికీ, ఎన్నికల అధికారిని రీనాబాబా సాహెబ్ కంగాలీ పదే పదే ఓట్లు వేయాలనీ విజ్ఞప్తులు చేసినప్పటికీ పనికి రాని ప్రజాస్వామ్య మంత్రం పారలేదు. ప్రజల రక్షణలో నిలిచిన మా వీర పీ.ఎల్.జీ.ఏ గెరిల్లాలు కేంద్ర, రాష్ట్ర పోలీసుల అణచివేత చర్యలను ప్రతిఘటించడంలో భాగంగా దాదాపు 10 మంది పోలీసులు మరణించడమో, గాయపడడమో జరిగింది. అక్కడక్కడ పోలింగ్ సిబ్బంది కూడ గాయపడ్డారు. ప్రజల రక్షణకు అంకితమైన .పీ.ఎల్.జే.ఏ. గెరిల్లాల సాహసిక చర్యలను సీ.ఆర్. బి. అభినందిస్తున్నది. ఎన్నికల సిబ్బంది ఇప్పటికైనా మా ప్రాంతాలలోకి పోలీసులు వెంట రాకూడదని మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాం. అతి త్వరలో తెలంగాణలోనూ ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల బహిష్కరణలో నమూనాగా నిలిచిన ఛత్తీస్ గఢ్ బీజాపుర్ ప్రజలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలోనూ ఎన్నికలు బహిష్కరించాలనీ మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ, దానిని అంటకాగుతున్న బీ.ఆర్.ఎస్.ను తన్ని తరమాలనీ మరోమారు పిలుపునిస్తున్నాం
తెలంగాణ ఎన్నికలపై మావోయిస్టుల లేఖ కలకలం..
137