ఎల్.బి నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వనస్థలిపురంలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ..
పార్టీ ఫిరాయించిన 12 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వద్దు. మధుయాష్కీ నాకు సోదరుడితో సమానం. ఆయన్ను ఎల్బీనగర్ లో 30వేల మెజారిటీతో గెలిపించండి. మూసీని ప్రక్షాళన చేసే బాధ్యత కాంగ్రెస్ ది. ముంపు ప్రాంతాల సమస్యను పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ ది. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం లో మధు అన్న ప్రత్యేక పాత్ర పోషిస్తారు. నన్ను ఆదరించి ఎంపీగా గెలిపించినట్లే మధు అన్నను గెలిపించండి. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసేదాంట్లో మధుయాష్కీ సంతకం ఉండబోతోంది. ఎల్బీనగర్ లో నమ్ముకున్న కాంగ్రెస్ కార్యకర్తలను సుధీర్ రెడ్డి నట్టేట ముంచిండు. అభివృద్ధి ముసుగులో అమ్ముడు పోయిండు. మూసికి చైర్మన్ అయిన సుధీర్ రెడ్డిని ఈ ఎన్నికల్లో మూసీలో తొక్కాలి అని విజ్ఞప్తినిచ్చారు.
telangana elections2023
రాష్ట్రంలో శాసన సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అచ్చంపేట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ బహిరంగ సభ కు టీపీపీసీ అధ్యక్షుడు ఏనుముల రేవంత్ రెడ్డి హాజరై ప్రసంగించారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దొరల గడీ ల పాలన వల్ల మన నల్లమల ప్రజలకు ఏమాత్రం న్యాయం జరగలేదని.. నిరుద్యోగ సమస్య తో యువతకు అన్యాయం చేశారనీ, కాంగ్రెస్ పార్టీ వస్తె రైతుభందు అని కెసిఆర్ తప్పుడు కూతలు కూస్తున్నాడని ధ్వజమెత్తారు.గువ్వల బాలరాజు ను మా అచ్చంపేట బిడ్డలు ఒక్క ఖాన్ భైరీ కొడితే పోయి గోపాల్ పేటలో పడాలి బిడ్డా ..గుండాయిజం అంతం అవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణ ను గెలిపించాలని కోరారు, ఈ ఒక్క నెల ఆగితే కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని వృద్దలకు 4000 ఆసరా పించన్ , మహిళకు, 2500 రూపాయలు, కౌలురైతులకు 12000, రైతులకు 15000 రూపాయలు ఇస్తామని, తెలిపారు, చీమల దండు లాగా సభకు వస్తు మీ ఉత్సాహం చూస్తుంటే వంశీకృష్ణ కు యాభై వేయిల మెజారిటీ విజయఢంకా మోగించి ఆశీర్వదిస్తున్నరు అని అన్నారు, అదేవిధంగా డిసెంబర్ 9 తేదీన హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో జరిగే ప్రమాణ స్వీకారానికి నా అచ్చంపేట ప్రజలు ఇదే ఆహ్వానం గా అందుకుని రావాలని పిలపునిచ్చారు, ఇదే క్రమంలో ఇంటెలిజెన్స్ పోలీసులను ఈ భారీ బహిరంగ సభ వీడియో లను చిత్రీకరించి కేసిఆర్ కు పంపడని సూచించారు.
ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లను వేగవంతంగా పంపిణీ చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ సెక్టోరియల్ అధికారులను ఆదేశించారు. సోమవారం బంజారాహిల్స్ లోని కొమరం భీమ్ భవన్ లో ఈ.వి.ఎం ల కమిషనింగ్ పై జిల్లా ఎన్నికల అధికారి సెక్టోరియల్ అధికారులకు, అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ… ఎన్నికల కమిషన్ సూచనల మేరకు సెక్టోరియల్ అధికారులు బి.ఎల్.ఓ ల ద్వారా ఇంటింటికి ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లను పంపిణీ చేయాలని, సంబంధిత సమాచారాన్ని బి.ఎల్.ఓ యాప్ ద్వారా పొందుపరిచే విధంగా ఆర్.ఓ చర్యలు తీసుకోవాలని తెలిపారు రిటర్నింగ్ అధికారికి అందజేయాలని తెలిపారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఓటరు ఇన్ఫర్మేషన్ స్లిప్ లన త్వరగా పంపిణీ చేసి నివేదిక పంపాలని తెలిపారు. ఎన్నికల సంఘం ఈ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ లో భాగంగా 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులకు తమ ఇంటి వద్దే ఓటు వేసేందుక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. హోం ఓటింగ్ లో సెక్టోరియల్ అధికారులు మైక్రో అబ్జర్వర్లు, పోలింగ్ ఏజెంట్ లు తప్పకుండా ఉండేలా చర్యలు తీసుకావాలని తెలిపారు. ఓటింగ్ అనంతరం వారికి వేలిపై సిరా చుక్క వేయడం జరుగుతుందని తెలిపారు. పోలింగ్ రోజు దివ్యాంగులకు సహాయకుడిగా వచ్చిన వారికి కుడి చేతి వేలిపై సిరా చుక్క వేయాలని అన్నారు
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు.సభ ఏర్పాట్లను బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ పరిశీలించారు. ఈ సందర్భంగా డికె అరుణ మాట్లాడుతూ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే సకలజనుల విజయ సంకల్ప సభకు అమిత్ షా తో పాటు కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మరికొంతమంది ప్రముఖులు హాజరు అవుతున్నట్టు డికె అరుణ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపి మేనిఫెస్టో ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించి గద్వాలలో జరిగే బహిరంగ సభలో మేనిఫెస్టో గురించి వివరిస్తారని, తెలంగాణ లో బిజెపి అధికారం వచ్చే విధంగా పార్టీ కృషి చేస్తుందని, అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగేలా మేనిఫెస్టో రూపొందిస్తారని అరుణ అన్నారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం 10 సంవత్సరాల కాలం కుటుంబాన్ని వదిలేసి, అవమానాలు పడి పోరాటం చేసి తెలంగాణ ను సాధించిన వ్యక్తి కేసీఅర్ అని అలాంటి వ్యక్తికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని కోరుకున్నారు రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి. బిఅర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామం లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం లో రాజ్యసభ సభ్యులు బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర పాల్గొన్నారు. పార్థసారథి రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఅర్ పాలనలో గ్రామాలు ఎంతగానో అభివృద్ధి చెందాయని, వెనకబడిన గ్రామాలు నేడు అత్యంత అద్భుతంగా అభివృద్ధి చెందాయి అని కొనియాడారు. సీతారామ ప్రాజెక్ట్ తో జిల్లా సస్యశ్యామలం కానుందని వివరించారు. కేసీఅర్ ప్రవేశ పెట్టిన ప్రతి పథకం ప్రతి వర్గానికి ఉపయోగ పడుతుంది అన్నారు. జనవరి నుండి ప్రతి మహిళకు సౌబాగ్యా లక్ష్మి పథకం పేరుతో మూడు వేలును కేసీఅర్ అందించనున్నారు అని పేర్కొన్నారు. కార్ గుర్తుకు ఓటు వేసి బిఅర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య ను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరుకున్నారు.
Read Also…
Read Also…
దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఎన్నుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి కోరారు. కేసీఆర్‌ది సంక్షేమమని, ప్రతిపక్షాలది సంక్షోభమని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం నాడు కందుకూరు మండలంలోని మాదాపూర్, కోలన్ గూడ, గుమ్మడివెల్లి, ఆకుల మైలారం, మీర్ ఖాన్ పేట్, అన్నోజిగూడ, గూడూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు చాలా కీలకమైనవని, ప్రజలు బాగా ఆలోచించి నిర్ణ యం తీసుకోవాలని కోరారు. ఎన్నో పథకాలను అమలు చేస్తున్న కారు పార్టీ ఇటువైపు ఉంటే.. ఎన్నికలు సమీపించగానే ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చే కాంగ్రెస్, బి జె పి మరో వైపు ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దేశంలోని ఇతర రాష్ట్రాలు అనుసరిస్తుంటే, కేవలం మూడు నుంచి నాలుగు గంటలు వ్యవసాయ కరెంటు ఇస్తున్న కర్ణాటక మోడల్ ను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పడం దివాళాకోరుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మరో వైపు సందర్భం దొరికిన ప్రతీ సారి తెలంగాణపై విషం చిమ్ముతున్న మోదీ వైఖరిని కూడా అర్థం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా ఇచ్చిన మోదీ దేవుడని బి జె పి నాయకులు అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమం చేసింది కేసీఆరేనని, ఇకముందు చేయబోయేది కూడా కేసీఆరేనని పేర్కొంటూ మళ్లీ బి అర్ ఎస్ పార్టీని గెలిపించి కేసీఅర్ ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పారు.
Read Also….
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ లేఖ విడుదల…బూటకపు ప్రజాస్వామ్య అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించిన ప్రజలకు విప్లవాభివందనాలు మా పార్టీ, భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ 5 రాష్ట్రాలలో జరుగుతున్న బూటకపు విధానసభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో ఛత్తీస్ గఢ్ లో తొలి విడుత నవంబర్ 7నాడు జరిగిన ఎన్నికలలో మా ఉద్యమ ప్రాంతాలలోని మెజార్టీ ప్రజలు ఎన్నికలను బహిష్కరించారు. మధ్య రీజినల్ బ్యూర్ అభినందిస్తున్నది. ఉద్యమ ప్రాంతాలలో ఒకటైన బీజాపుర్ నియోజికవర్గం లో కేవలం 41 శాతం పోలింగ్ మాత్రమే జరిగి దాదాపు 59 శాతం ప్రజలు ఎన్నికలను బహిష్కరించి వాటి బూటకత్వాన్ని ఎండగట్టారు. ఛత్తీస్ గఢ్ లో విధానసభ ఎన్నికలు రెండు విడుతలుగా జరుపుతున్నారు. తొలి విడుత పోలింగ్ జరిగిన 20 నియోజికవర్గాలు మా ఉద్యమ ప్రాంతంలోనే వుండడంతో వీటిలో 1-2 చోట్ల మినహా ఎక్కడా 50-60 శాతానికి మించి పోలింగ్ జరుగలేదు. మా ప్రాంతాలలోని ప్రజలు తాము ప్రజాస్వామ్యయుతంగా ఎన్నుకుంటున్న విప్లవ ప్రజా కమిటీ (జనన సర్కార్)లపైనే మరోమారు తమ విశ్వాసాన్ని ప్రకటించారు. ఎన్నికల సమయంలో ప్రజలలో భయోత్పాతాన్ని సృష్టించడానికి పెద్ద ఎత్తున అదనపు అదనపు భద్రతా బలగాలను దించారు. ఇప్పటికే వేలాది సంఖ్యలో అడుగడుగున తుపాకులు ధరించిన ఖాకీలతో అడవులు నిండిపోగా, మరిన్ని అదనపు బలగాలను తెచ్చి మొహరించినప్పటికీ, ఎన్నికల అధికారిని రీనాబాబా సాహెబ్ కంగాలీ పదే పదే ఓట్లు వేయాలనీ విజ్ఞప్తులు చేసినప్పటికీ పనికి రాని ప్రజాస్వామ్య మంత్రం పారలేదు. ప్రజల రక్షణలో నిలిచిన మా వీర పీ.ఎల్.జీ.ఏ గెరిల్లాలు కేంద్ర, రాష్ట్ర పోలీసుల అణచివేత చర్యలను ప్రతిఘటించడంలో భాగంగా దాదాపు 10 మంది పోలీసులు మరణించడమో, గాయపడడమో జరిగింది. అక్కడక్కడ పోలింగ్ సిబ్బంది కూడ గాయపడ్డారు. ప్రజల రక్షణకు అంకితమైన .పీ.ఎల్.జే.ఏ. గెరిల్లాల సాహసిక చర్యలను సీ.ఆర్. బి. అభినందిస్తున్నది. ఎన్నికల సిబ్బంది ఇప్పటికైనా మా ప్రాంతాలలోకి పోలీసులు వెంట రాకూడదని మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాం. అతి త్వరలో తెలంగాణలోనూ ఎన్నికలు జరుగునున్నాయి. ఎన్నికల బహిష్కరణలో నమూనాగా నిలిచిన ఛత్తీస్ గఢ్ బీజాపుర్ ప్రజలను ఆదర్శంగా తీసుకొని తెలంగాణలోనూ ఎన్నికలు బహిష్కరించాలనీ మరో మారు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీ, దానిని అంటకాగుతున్న బీ.ఆర్.ఎస్.ను తన్ని తరమాలనీ మరోమారు పిలుపునిస్తున్నాం
హైదరాబాద్ జిల్లాకు సాధారణ ఎన్నికల పరిశీలకులుగా 8 మంది ఐ.ఏ.ఎస్ అధికారులు హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలను పరిశీలించడానికి భారత ఎన్నికల సంఘం 8 మంది ఐ.ఏ.ఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించిందని జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. వారి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.
- మలక్ పేట్ – అంబర్ పేట్ నియోజకవర్గాలకు యతీంద్ర ప్రసాద్ ఐ.ఏ.ఎస్ (8125971984)
- చార్మినార్ – చాంద్రాయణ గుట్ట నియోజకవర్గాలకు సమీర్ వర్మ ఐ.ఏ.ఎస్ (8125972478)
- ఖైరతాబాద్ – జూబ్లీహిల్స్ నియోజకవర్గాలకు జె.జయకాంతన్ ఐ.ఏ.ఎస్ (8125967488)
- సనత్ నగర్ – నాంపల్లి నియోజకవర్గాలకు డా. అహ్మద్ ఇక్బాల్ ఐ.ఏ.ఎస్ (8125972156)
- కార్వాన్ – గోషామహల్ నియోజకవర్గాలకు కవిత రాము ఐ.ఏ.ఎస్ (8125971991)
- యాకత్ పుర – బహదూర్ పుర నియోజకవర్గాలకు దీపాంకర్ సిన్హా ఐ.ఏ.ఎస్ (8125972009)
- సికింద్రాబాద్ – సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాలకు గాయత్రి క్రిష్ణన్.బి ఐ.ఏ.ఎస్ (8125972486)
- ముషీరాబాద్ నియోజకవర్గానికి సచీంద్ర ప్రతాప్ సింగ్ ఐ.ఏ.ఎస్ (8125972490)





Total views : 57027