ప్రజా తెలంగాణ.. దొరల తెలంగాణ మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం రావాలన్నారు. కొల్లాపూర్లో నిర్వహించిన పాలమూరు ప్రజా భేరి సభలో రాహుల్ మాట్లాడారు. బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ వస్తే రైతుబంధు నిలిచిపోతుందని ఆరోపిస్తున్నారని, అందులో వాస్తవం లేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులతో సహా అందరికీ రైతు భరోసా కింద రూ.15వేలు అందిస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు కూడా రూ.12వేలు ఇచ్చి ఆదుకుంటామన్నారు. దిల్లీలో ముఖ్యమైన సమావేశం ఉన్నా.. ప్రియాంక అనారోగ్యం దృష్ట్యా నేను ఈ పర్యటనకు వచ్చానన్నారు. ఓవైపు సీఎం కుటుంబం.. మరోవైపు తెలంగాణ సమాజం.. నిరుద్యోగులు, మహిళలున్నారన్నారు. దొరల తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రజలు గమనిస్తున్నారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జూపల్లి కృష్ణారావు తదితరులు సభలో పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజా, దొరల మధ్య ఎన్నికలు
114
previous post