65
త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భావి సీఎం కేటీఆర్ అంటూ చాలాకాలంగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ జాతియ రాజకీయాల్లోకి వెళతారని, రాష్ట పీఠాన్ని కేటీఆర్ అధిష్ఠిస్తారని గతంలో కొన్ని వ్యాఖ్యలు వినిపించాయి. ఇక దినిపై మంత్రి కేటీఆర్ స్పందించారు…బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యే అర్హతలు ఉన్న వాళ్లు చాలామంది ఉన్నారని వ్యాఖ్యానించారు. తనకు అలాంటి కోరికలు ఏమీ లేవని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి ముమ్మాటికీ కేసీఆరేనని….ప్రతిపక్షాలకు నా మీద ప్రేమ ఎక్కువగా ఉందన్నారు. అందుకే నేను సీఎం కావాలని కోరుకుంటున్నారని కేటీఆర్ చమత్కరించారు.