కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి సందర్భంగా ప్రజల జీవితాల్లో ఆనందాలు సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. నరకాసురుడు అనే చెడు రాక్షసుడిని లక్ష్మీదేవి సంహరించిన సందర్భంగా, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ప్రజలు దీపావళి పండుగను జరుపుకుంటున్నారని తెలిపారు . లక్ష్మీదేవి కటాక్షం నియోజకవర్గ ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. దీపావళి పండుగని ప్రతి ఒక్కరూ ఆనందాలతో జరుపుకోవాలని, బాణాసంచా కాల్చేటప్పుడు ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని మహీధర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధానంగా చిన్నారులు టపాసులు కాల్చే సమయంలో తగు జాగ్రత్తలు తీసుకొని ఇంటిల్లిపాది సంతోషంగా దీపావళి పండుగను జరుపుకోవాలని కోరారు.
దీపావళి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి.
81