దేశంలో తెలంగాణను నెంబర్ వన్‍గా తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం..

Advertisements

<p>తెలంగాణను దేశానికి భవిష్యత్‌ ఆర్థిక శక్తిగా మారుస్తామని &comma; క్యూర్‌&comma; ప్యూర్‌&comma; రేర్ కాన్సెప్ట్‌తో ముందుకు వెళ్తున్నామని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు &period; తెలంగాణ సమ్మిట్‌ ను ఎంతో అద్భుతంగా నిర్వహించామని పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని డిప్యూటీ సీఎం &comma; ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు &period;గతం కన్నా ఏ రంగాలకు ఎక్కువ నిధులు కేటాయించారు &quest; లక్ష్యం నెరవేరుతుందా &quest;<&sol;p>&NewLine;<p>3 లక్షల 24 వేల 234 కోట్ల రూపాయలతో తెలంగాణ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టారు డిప్యూటీ ముఖ్యమంత్రి &comma; ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క &period;మేం పాలకులం కాదు&period;&period; ప్రజలకు సేవకులం అని చెబుతూ ప్రతి పౌరుడికి సామాజిక న్యాయం అందించడమే లక్ష్యమన్నారు &period; తెలంగాణను అభివృద్ధి మార్గంలో తీసుకెళ్తున్నామన్నారు &period;ఈసారి కూడా సంక్షేమానికి పెద్ద పీట వేసినట్లు తెలుస్తుంది &period; రైతు సంక్షేమం కోసం &&num;8211&semi; రూ&period;23&comma;179కోట్లు &comma; సివిల్ సప్లయ్ శాఖకు రూ&period;7&comma;366 కోట్లు&comma; పశుసంవర్ధక శాఖకు రూ&period;1&comma;529 కోట్లు&comma; విద్యుత్ శాఖకు రూ&period;21&comma;285 కోట్లు కేటాయించారు &period;దీనిలో ఎక్కువ భాగం వ్యవసాయ పంపు సెట్లకు ఉచిత విద్యుత్ పధకానికి పోతుంది &period; అదే క్రమంలో విద్యా శాఖకు రూ&period;26&comma;674 కోట్లు&comma;వైద్య రంగానికి &&num;8211&semi; రూ&period;13&comma;679కోట్లు కార్మికుల సంక్షేమం కోసం రూ&period;999 కోట్లు &comma; మహిళా శిశు సంక్షేమం &&num;8211&semi; రూ&period;3&comma;143 కోట్లు ఎస్సీ సంక్షేమానికి రూ&period;11&comma;784 కోట్లు &comma; ఎస్టీ సంక్షేమం కోసం రూ&period;7&comma;937కోట్లు&comma; బీసీ సంక్షేమం కోసం రూ&period;12&comma;511 కోట్లు&comma; మైనారిటీ సంక్షేమానికి రూ&period;3&comma;769 కోట్లు కేటాయించారు &period;<&sol;p>&NewLine;<p>మరో వైపు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిచేస్తున్నామంటున్న భట్టి గొప్పల కోసం మేం అబద్ధాలు చెప్పమని తెలిపారు &period; బడ్జెట్ అంటే అంకెల చుట్టూ తిరిగే సంఖ్యలు కాదని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలని భట్టి వివరించారు&period; దేశంలో తెలంగాణను నెం&period;1గా నిలబెట్టాలన్నదే తమ లక్ష్యమన్న భట్టి సంక్షేమం&comma; అభివృద్ధి తమకు తొలి ప్రాధాన్యం అని చెప్పారు &period;ఈ క్రమంలోనే శాంతి భద్రతలు కోసం రూ&period;11&comma;907 కోట్లు &comma; రాబోయే గోదావరి పుష్కరాలు కోసం రూ&period;500 కోట్లు పర్యాటక శాఖ కు రూ&period;1&comma;224 కోట్లు &comma; రాజీవ్ యువ వికాసం పధకానికి రూ&period;6వేల కోట్లు &comma; గృహ నిర్మాణ రంగానికి రూ&period;7&comma;430 కోట్లు ఐటీ రంగానికి రూ&period;875 కోట్లు &comma; పరిశ్రమల శాఖకు రూ&period;3&comma;490 కోట్లు &comma;చేనేత రంగానికి రూ&period;258 కోట్లు &comma; పంచాయతీ రాజ్&comma; గ్రామీణాభివృద్ధి శాఖకు రూ&period;33&comma;688 కోట్లు &comma; సాగునీటి ప్రాజెక్టులు కోసం రూ&period;22&comma;615 కోట్లు&comma; పట్టణాభివృద్ధి&comma; పురపాలక శాఖ కోసం రూ&period;17&comma;907కోట్లు కేటాయించారు &period;<&sol;p>&NewLine;<p>మొత్తం బడ్జెట్ రూ&period;3&comma;24&comma;234 కోట్లులో రెవెన్యూ వ్యయం రూ&period;2&comma;34&comma;406 కోట్లు &comma; మూలధన వ్యయం రూ&period;47&comma;267 కోట్లుగా ఉండడం సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తుంది &period; రాష్ట్రంలో కోటి 15లక్షల కుటుంబాలకు రూ&period;5 లక్షల జీవితబీమా సౌకర్యం అందించనున్నారు &period; జూన్ 2 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అమలు అవుతుందని పేర్కొన్నారు &period; దేశానికి తెలంగాణ బలమైన గ్రోత్ ఇంజిన్ అని తెలిపారు భట్టి &period; జాతీయ వృద్ధి రేటు కంటే తెలంగాణది 2&period;7శాతం ఎక్కువ అని వివరించారు &period; తెలంగాణ తలసరి ఆదాయం 1&period;9 రెట్లు పెరిగింద న్నారు &period; 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ &comma; 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు &period;మొత్తం మీద తెలంగాణ బడ్జెట్ లో సంక్షేమానికే పెద్ద పీట వేశారని చెప్పొచ్చు &period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఘనంగా క్రాస్ స్టేట్ రియాల్టీ షో జంగిల్ బుగీ కర్టెన్ రైజర్ ఈవెంట్..

చిలకా ప్రొడక్ష‌న్స్ థ్రిల్ల‌ర్ ‘మరీచిక’ 29న వరల్డ్ వైడ్‌గా మూవీ గ్రాండ్ రిలీజ్‌..

తెలంగాణలో 25 ఏళ్ల తర్వాత ఎస్ఐఆర్