ధనత్రయోదశికి ఈ పనులు చేస్తే… అష్టైశ్వర్యాలు మీ సొంతం !!

Diwali

Advertisements

&NewLine;<p>దీపావళి పండుగకు రెండు రోజుల ముందు మనం అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ ధన త్రయోదశి&period; దీపావళి పండుగను సహజంగా ధన త్రయోదశి పర్వదినంతోనే ప్రారంభించే ఆచారం పూర్వం నుంచి వస్తున్నది&period; అసలు సంప్రదాయం ఏంటంటే దీపావళి ఐదురోజుల పండుగ&period; ధన త్రయోదశి నాడు ధన్వంతరి జయంతిగా భావించి ధన్వంతరిని విశేషంగా పూజిస్తారు&period; ధన త్రయోదశి లక్ష్మీ దేవికి ఇష్టమైన రోజని&comma; కుబేరుడు సంపదలు పొందిన రోజని చెప్తారు&period; ప్రతి సంవత్సరం ఆశ్వయుజ బహుళ త్రయోదశి రోజును ధన త్రయోదశి గా జరుపుకుంటారు&period; ఇక ధన త్రయోదశి రోజు చాలామంది బంగారం&comma; వెండి&comma; వాహనాలు&comma; వస్త్రాలు&comma; పాత్రలు ఇలా కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారనటంలో సందేహం లేదు&period; చివరకు ఒక గ్రాము బంగారమైన కొనుగోలు చేయాలని మహిళలు భావిస్తారు&period; అయితే ధన త్రయోదశినాడు బంగారాన్ని కొనుగోలు చేయడం కంటే కొన్ని ముఖ్యమైన వస్తువులను దానం చేస్తే బంగారాన్ని కొనుగోలు చేసి దానంచేసినంత పుణ్య ఫలాలు వస్తాయని చెబుతున్నారు&period; ధన త్రయోదశి నాడు పాలు పెరుగు తేనె వెన్న దానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పరిహార శాస్త్రం తెలుపుతుంది&period; అంతేకాదు ధన త్రయోదశి నాడు తెల్లని వస్త్రాలు&comma; కాళ్లకు చెప్పులు&comma; గొడుగు దానం చేస్తే అఖండమైన సంపదలు వస్తాయని బుతున్నారు &period; భార్యాభర్తల జీవితం సాఫీగా సాగాలంటే&comma; దంపతులు అన్యోన్యంగా జీవితం సాగించాలంటే ధన త్రయోదశి నాడు ఎవరికైనా పరుపును కానీ&comma;<br>మంచాన్ని కానీ దానం చేస్తే మంచిదని చెబుతున్నారు&period; ఇలా దానం చేస్తే ఆ దంపతులు ఎప్పటికీ విడిపోరని అంటున్నారు&period; సువర్ణ దానం&comma; వస్త్ర దానం&comma; శయ్యా దానం&comma; వస్తు దానం&comma; పదార్థాల దానం ఇలా ఐదు రకాల దానాలలో ఏ దానం చేసినా అఖండమైన ఐశ్వర్యం కలుగుతుందని చెబుతున్నారు&period; లక్ష్మీ దేవి ఈ దానాలతో సంతోషిస్తుందని&comma; దానాలు చేసిన వారిపై ఎప్పటికీ లక్ష్మీ దేవి కటాక్షం ఉంటుందని అంటున్నారు&period; ధన త్రయోదశి రోజు ఉన్న దానిలో<br>కొద్దో గొప్పో దానం చేస్తే మంచి ఫలితం ఉంటుందని పండితులు తెలియచేన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..