126
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటి రోజు ధర్మవరంలో వైసీపీ నాయకులు చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి మాట్లాడుతు వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు చేపడుతున్న యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర కాదని అది కేవలం జగన్ రెడ్డి భజన యాత్రని కమ్మ కులస్తులను విమర్శించేందుకే ధర్మవరంలో ఈ బస్సు యాత్ర పెట్టారని కులాన్ని పెట్టి విమర్శించడం హేయమైన చర్యని అలాగే సామాజిక న్యాయం అంటే బీసీలను,మైనార్టీలను పీకి ఓసి మంత్రులకు ఇవ్వడమే సామాజిక న్యాయం అంటారా అంటూ బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ వారి యొక్క దొంగ యాత్రను గమనిస్తున్నారని 2024లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.