శుక్రవారం స్థానిక టిడిపి కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను బాగుంటే చాలు, నా పార్టీ ఎమ్మెల్యేలు దోచుకుంటే చాలని జగన్ రెడ్డి నాలుగు నరేల్లగా అవినీతి అక్రమాలు చేస్తూ ప్రజలకు ఒక్క మంచి పని కూడా చేయలేదని ఆయన పెద్దేవా చేశారు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ రెడ్డి రాష్ట్రంలో యువత జీవితాన్ని నాశనం చేశారని విమర్శించారు. టిడిపి పాలనలో సమాజం బాగుండాలని చంద్రబాబు నాయుడు ఆలోచించి యువతకు పెద్దపీట వేస్తూ 6.50 లక్షల ఉద్యోగాలు కల్పించి ఆదుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనను చూసి ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయాయని అన్నారు. రాష్ట్రానికి భవిష్యత్తునివ్వటం చేతగాని అసమర్ధ సీఎం జగన్ రెడ్డి గజ దోపిడీ చేస్తున్నారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Bus Trip
కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ టిడిపి మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, టిడిపి రాష్ట్ర కార్యదర్శి పిల్లి సత్యనారాయణ మూర్తి మీడియా సమావేశం. బస్సు యాత్రకు వ్యతిరేకంగా టిడిపి నాయకులు నిరసన తెలిపితే బస్సు చక్రాలక్రింద తొక్కుకుంటూ పోతాము అన్న అనీల్ కుమార్ యాదవ్ వ్యాఖ్య అభ్యంతరకరంగా ఉన్నాయి. అనీల్ కుమార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యం లో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంది. ఇప్పటి వరకు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబు గాని మేము కాని ఎప్పుడూ వ్యక్తి గతం గాను, అభ్యంతరకరంగా విమర్శలు చేసుకోలేదు. అనీల్ కుమార్ యాదవ్ మాట్లాడిన మాటలు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కన్నబాబు కి ఇబ్బందికరం. నెల్లూరు జిల్లాలో ఎంత మందిని ఈయన బస్సులు పెట్టి తొక్కించేసాడో. అనీల్ కుమార్ వ్యాఖ్యలు ఎంత వరకు సమంజసమో స్ధానిక ఎమ్మెల్యే కన్నబాబు విచక్షణకే వదిలి పెడుతున్నాము. బిసి ఎస్సీ ఎస్టీ లకు జగన్ చేసింది ఏమీ లేదు. బిసి, ఎస్సీ, ఎస్టీలకు మహిళలకు సామాజిక న్యాయం చేసింది టిడిపి వ్యవస్ధాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు మాత్రమే. టిడిపి లో బిసి లకు మహిళలకు సరైన గుర్తింపు ఇచ్చారు కాబట్టే నేను ఒకసారి ZPTCగాను, రెండు సార్లు ఎమ్మెల్యేగాను, రెండు సంవత్సరాలు టిటిడి బోర్డు మెంబర్ గాను పనిచేసాను.
జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నిన్నటి రోజు ధర్మవరంలో వైసీపీ నాయకులు చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర గురించి మాట్లాడుతు వైసీపీ మంత్రులు,ఎమ్మెల్యేలు చేపడుతున్న యాత్ర సామాజిక సాధికార బస్సు యాత్ర కాదని అది కేవలం జగన్ రెడ్డి భజన యాత్రని కమ్మ కులస్తులను విమర్శించేందుకే ధర్మవరంలో ఈ బస్సు యాత్ర పెట్టారని కులాన్ని పెట్టి విమర్శించడం హేయమైన చర్యని అలాగే సామాజిక న్యాయం అంటే బీసీలను,మైనార్టీలను పీకి ఓసి మంత్రులకు ఇవ్వడమే సామాజిక న్యాయం అంటారా అంటూ బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు అందరూ వారి యొక్క దొంగ యాత్రను గమనిస్తున్నారని 2024లో వారికి కచ్చితంగా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామాజిక సాధికారత బస్సుయాత్ర పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో గుంటూరులో తూర్పు నియోజకవర్గంలో చేపట్టనున్న బస్సు యాత్ర ప్రతిష్టాత్మకంగా తన భుజాలపై వేసుకొని నడిపిస్తున్నారు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా తనయురాలు నూరి ఫాతిమా. ఈ కార్యక్రమంలో తనకు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, రాష్ట్రస్థాయిలోని పెద్దలు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందిస్తున్నారంటున్నారు నూరి ఫాతిమా. వచ్చే ఎన్నికలలో తూర్పు నియోజకవర్గ సీటు తనదే అంటున్న తూర్పు ఎమ్మెల్యే తనయురాలు గుంటూరు జిల్లా వైసీపీ పార్టీ ప్రధాన కార్యదర్శి నూరి ఫాతిమాతో మా సివిఆర్ న్యూస్ ప్రతినిధి నాగేశ్వరరావు ఫేస్ టు పేస్.





Total views : 78313