నవ నందులు కొలువు దీరిన మహానంది క్షేత్ర సీమ

Mahanandeswara Temple

Advertisements

&NewLine;<p>మహానంది ఒక గొప్ప శివ క్షేత్రం&period; ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాలోని ఈ యాత్రాస్థలం ఒక మండల కేంద్రం కూడా&period;నంద్యాల కు 14 కి&period;మీ దూరంలో ఉన్న మహాక్షేత్రం మహానంది&period; ఇక్కడ గల స్వామి మహానందీశ్వరుడు&comma; అమ్మవారు కామేశ్వరీ దేవి&period; ఇక్కడి మహానందీశ్వర దేవాలయం 7వ శతాబ్ధినాటిది&period; ఈ ఆలయ శిల్పశైలిని బట్టి ఇది బాదామి చాళుక్య చక్రవర్తి వినయాదిత్యుని పాలనాకాలం &lpar;680-696&rpar; నాటిదని పురాతత్త్వ శాస్త్రవేత్తలు అంచనా వేశారు&period; చ్చట గల శివలింగము ఎత్తుగా కాక కొంచెము అణగి వుంటుంది&period; పుట్టలో గల స్వామివారికి ఆవు పాలు ఇస్తుండగా కోపించిన యజమాని ఆవుని కొట్టగా పుట్టలో గల స్వామివారిని ఆవు తొక్కి నందు వలన లింగము అణిగివుంటుంది&period; ఆవు గిట్ట గుర్తు లింగముపై వుంటుంది&period; ఇచ్చట జలమే ఒక విశేషం&period; శుద్ధ స్ఫటిక వర్ణంలో కనిపించే జలం జలజలా ప్రవహించే దృశ్యం మహానంది క్షేత్రానికి మాత్రమె సొంతం&period; ఇక్కడి కోనేర్లు &lpar;పుష్కరిణిలు&rpar; విశ్వబ్రాహ్మణ శిల్పుల యొక్క అత్యద్భుత పనితనాన్ని తెలియజేస్తాయి&period; ప్రధాన ఆలయానికి రాజ గోపురానికి మధ్యలో ఉన్న పుష్కరిణి లోనికి స్వచ్చమైన నీరు సర్వ వేళలా గోముఖ శిల నుంచి ధారావాహకంగా వస్తుంటుంది&period; ప్రధాన ఆలయంలోని లింగం క్రింద భూమిలో ఐదు నీటి ఊటలు ఉన్నాయి&period; లింగము క్రింద నుండి సదా నీరు ఊరుతూనే వుంటుంది&period; ఆ నీరు పుష్కరిణిలోనే బయటకు కనిపిస్తుంది&period; అందులోనికి వచ్చిన నీరు గోపురం ముందున్న రెండు గుండాల ద్వార బయటకు పారుతుంది&period; ఈ నీరు బయటకు ప్రవహించే మార్గల అమరిక వలన పుష్కరిణిలో నీరు ఎల్లప్పుడు ఒకే స్థాయిలో &lpar;1&period;7 మీటర్లు&rpar; నిర్మలంగా&comma; పరిశుభ్రంగా ఉంటుంది&period; ఈ నీరు ఎంత స్వచ్ఛంగా వుంటుందంటే నీటిపై కదలిక లేకుంటే నీరున్నట్టే తెలియదుఐదున్నర అడుగులు లోతున్నా క్రిందనున్న రూపాయి బిళ్ల చాల స్పష్టంగా కనబడుతుంది&period; ఆలయ ఆవరణంలో కొన్ని బావులున్నాయి&period; ఆ బావులు అన్నింటిలోను ఇలాంటి నీరే వున్నది&period; ఈ నీటిని తీర్ధంగా భక్తులు తీసుకెళతారు&period; మరో గొప్ప విశేషం&period; ఈ మహనంది క్షేత్రంలో ఊరే ఊట నీరు సుమారు 3000 ఏకరాలకు సాగు నీరు అందజేస్తోంది&period; ఇచ్చట బ్రహ్మ&comma; విష్ణు&comma; రుద్ర గుండాలు కోనేర్ల రూపంలో ఉన్నాయి&period; మహాశివరాత్రి పుణ్యదినమున లింగోధ్బవసమయమున అభిషేకము&comma; కళ్యాణోత్సవము&comma; రధోత్సవములు జరుగుతాయి&period; కోదండరామాలయం&comma; కామేశ్వరీదేవి ఆలయం ఇతర దర్శనీయ స్థలాలు ఇక్కడ ఉన్నాయి&period; కాగా మహానందికి 18 కిలోమీటర్ల పరిధిలో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి&period; వీటన్నిటినీ కలిపి నవ నందులని పిలుస్తారు&period; అన్నిటినీ దర్శిస్తే గొప్ప పుణ్య ఫలితం కలుగుతుంది&period; నంద్యాల నుండి మహానందికి నేరుగా బస్సు సౌకర్యము కలదు&period; గిద్దలూరు-నంద్యాల మార్గంలో ఉన్న గాజులపల్లె&comma; ఈ శివ క్షేత్రానికి సమీప రైల్వే స్టేషను&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టలో స్వాతి నక్షత్రం వేడుకలు..

నేటి నుంచి నరసింహ స్వామి జయంతి ఉత్సవాలు..

కేరళ రాష్ట్రంలోని త్రిస్సూర్‌లో పూరం ఉత్సవాలు..