పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం.

పుష్కరాల లక్ష్యంగా ఆలయాల అభివృద్ధి పనులు వేగవంతం

Advertisements

<p>2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కె&period; రామచంద్ర మోహన్ తెలిపారు&period; డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానం&comma; మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వరస్వామి దేవస్థానాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు&period;వాడపల్లి దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అన్నదాన భవనం పనుల పురోగతిని సమీక్షించిన కమిషనర్&comma; 12 కోట్ల రూపాయలతో నిర్మించనున్న &OpenCurlyQuote;శ్రీనివాసం’ వసతి భవనం ప్రతిపాదనలను&comma; స్థల పరిస్థితులను పరిశీలించారు&period; భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు&period; అనంతరం మందపల్లి శ్రీ మందేశ్వర శనీశ్వరస్వామి దేవస్థానంలో సుమారు 3 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అభిషేక మండపం&comma; అన్నదాన భవనం పనులను పరిశీలించారు&period; గోదావరి పుష్కరాల నాటికి అన్ని అభివృద్ధి పనులను పూర్తి చేసి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజధాని అభివృద్ధిపై చంద్రబాబు సమీక్ష.

ఏపీ హైకోర్డులో రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విచారణ.

లంచగొండి అధికారుల్లో మార్పు రాకపోవడానికి కారణం ఏంటి.