బి ఆర్ ఎస్ పార్టీ మునిగిపోయే పడవ లాంటిదని, ఎంతమంది చేరినా ఒక సున్న తర్వాత మరో సున్నా చేరినట్టేనన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి. వారి వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదన్నారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కాంగ్రెస్ అభ్యర్థి అనిరుద్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించిన భారీ ర్యాలీలో మల్లు రవి పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు బాలనగర్ నుండి రాజపూర్ జడ్చర్ల వరకు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. అనంతరం మల్లు రవి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుడు ఎర్ర శేఖర్ టికెట్ దక్కకపోవడంతో బిఆర్ఎస్ పార్టీలో చేరారని తమ పార్టీకి నష్టమేమీ లేదని మల్లు రవి అన్నారు. ఈ ఎన్నికల్లో 50వేల మెజారిటీతో అనిరుద్ రెడ్డి విజయం సాధించబోతున్నారన్నారు. అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థి అనిరుద్ రెడ్డి మాట్లాడుతూ తాను గెలిచిన వంద రోజుల్లో నియోజకవర్గంలోని నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లతో పాటు అనేక అభివృద్ధి పనులు చేపడతానని ఆయన అన్నారు.
నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ హౌస్ – అనిరుద్ రెడ్డి
108
previous post