రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ఇవాళ సీఎం జగన్ పుట్టపర్తికి విచ్చేస్తుండడంతో వైసీపీ శ్రేణులు భారీ స్వాగతం చేపట్టాయి. సభా ప్రాంగణం మొదలు రహదారులు మొత్తం భారీ కటౌట్లు ఫ్లెక్సీలు, వైసీపీ జెండాలతో నింపేశాయి. గత ఐదు రోజుల నుంచి జిల్లా అధికార పోలీస్ యంత్రాంగం సభకు తరలివచ్చే ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బందులు ఎత్తకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాయి. ఎస్పీ మాధవరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 1500 మంది పోలీసు సిబ్బంది అడుగడుగునా భద్రత కట్టుదిట్టం చేశారు. పుట్టపర్తి శ్రీ సత్యసాయి విమానాశ్రయం మొదలు సభా ప్రాంగణం వరకు మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని డేగ కళ్లతో పహారా కాస్తున్నారు. సాధారణ పౌరులకు ఇబ్బందులు కలగకుండా, ట్రాఫిక్ కు అంతరాయం తలెత్తకుండా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేశారు.
నేడు రైతు భరోసానితులు విడుదల..
125
previous post