నేపాల్‌లో భారీ భూకంపం..

Nepal

Advertisements

&NewLine;<p>నేపాల్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది&period; జార్కోట్ జిల్లాలో లాబిదండా ప్రాంతంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు నేషనల్ సెంటర్ ఫర్సీ స్మాలజీ గుర్తించింది&period; రిక్టర్ స్కేలుపై 6&period;4 తీవ్రత కలిగిన ఈ భూకంపం ధాటికి అనేక ఇళ్లు&comma; భవంతులు కూలిపోయాయి&period; శిథిలాల కింద చిక్కుకుని ఇప్పటివరకూ 60కిపైగా మృతి చెందారు&period; ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది&period; ప్రభావిత ప్రాంతంలోని శిథిలాల కింద ఉన్న వారిని కాపాడేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్న దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి&period; కాగా&comma; భూకంప ప్రభావం ఢిల్లీతో పాటూ ఉత్తరాదిన పలు ప్రాంతాల్లోనూ కనిపించింది&period; భూకంపం రాత్రి వేళ సంభవించడంతో జరిగిన నష్టంపై పూర్తి సమాచారం ఇప్పుడే ఇవ్వలేమని నేపాల్ అధికారులు తెలిపారు&period; ఘటనపై వెంటనే స్పందించిన నేపాల్ ప్రభుత్వం అత్యవసర&comma; విపత్తు నిర్వహణ సిబ్బంది&comma; భద్రతా దళాలను రంగంలోకి దింపింది&period; భారత భూఫలకం&comma; యూరేసియా ఫలకం కలిసే ప్రదేశంలో నేపాల్ ఉండటంతో ఇక్కడ భూకంపాలు నిత్యం సంభవిస్తుంటాయని నిపుణులు చెబుతున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.