పద్మారావు నగర్ లో తలసాని పాదయాత్ర..

Advertisements

&NewLine;<p>పేదలు గొప్పగా ఉండాలనేది తమ లక్ష్యమని సనత్ నగర్ అసెంబ్లీ బిఆర్ఎస్ అభ్యర్థి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు&period; సోమవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పద్మారావు నగర్&comma; నాగదేవత టెంపుల్&comma; ఈశ్వరమ్మ బస్తీ&comma; హమాలీ బస్తీ&comma; చిదానందం కాలనీ తదితర ప్రాంతాలలో పాదయాత్ర గా ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు&period; ప్రతి ఇంటి వద్ద మంత్రిని శాలువాలు కప్పి&comma; పూలమాలలు వేసి&comma; మంగళ హారతులు పట్టి ఘన స్వాగతం పట్టారు&period; ప్రచారంలో అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు&period; ఈశ్వరమ్మ బస్తీ&comma; పద్మారావు నగర్ ఏరియా బస్తీల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించామని&comma; ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మళ్ళీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే కనుక మిగిలిన సమస్యలను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు&period; నిరుపేదలు అత్యధికంగా నివసించే హమాలీ బస్తీలో అన్ని సౌకర్యాలతో కూడిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం ఎన్నికలు పూర్తయిన తర్వాత చేపట్టి తీరుతామని స్పష్టం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

హైదరాబాద్: జీడిమెట్ల పరిధిలో బంగ్లాదేశీయుల అరెస్ట్.

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం.

మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఎమ్మెల్యే మధుసూదన్ పర్యటన.