పశ్చిమాసియాలో భీకరంగా జరుగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Advertisements

<p>పశ్చిమాసియాలో భీకరంగా జరుగుతున్న యుద్ధానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది&period; ఇరాన్‌పై యుద్ధాన్ని 5 రోజుల పాటు ఆపేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు&period; ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై దాడులు ఆపేస్తున్నట్లు చెప్పారు&period; రెండు రోజులుగా ఇరాన్‌తో జరిగిన చర్చలు సానుకూలంగా సాగాయని పేర్కొన్నారు&period; పశ్చిమాసియాలో తాము శాంతికోసం కృషి చేస్తామన్నామని&period;&period; మరోవారం రోజుల పాటు చర్చలు జరిగే అవకాశం ఉందని అన్నారు&period; చర్చల ఫలితంపై ఆధారపడి భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు&period; గతంలో విధించిన 48 గంటల గడువు ముగుస్తుండటంతో ట్రంప్ ఈ ప్రకటన చేయడం గమనార్హం&period;<&sol;p>&NewLine;<p>అయితే యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు చేసిన ప్రకటనపై ఇరాన్ స్పందించింది&period; ట్రంప్ వ్యాఖ్యలను నమ్మలేమని కొట్టిపారేసింది&period; ఆ వ్యాఖ్యలను ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించే కుట్రగా అభివర్ణించింది&period; ట్రంప్‌తో తాము ఎలాంటి చర్చలూ జరపలేదని&comma; తమ హెచ్చరికలతోనే ఆయన వెనక్కి తగ్గారని స్పష్టం చేసింది&period; చమురు à°§à°°à°² తగ్గింపు కోసమే ఈ నాటకాలు అని విమర్శించింది&period; యుద్ధ నివారణ కోసం గల్ఫ్ దేశాలు చొరవ తీసుకున్నాయని&comma; అయితే తాము చర్చల ప్రతిపాదను తిరస్కరించామని ఇరాన్ స్పష్టం చేసింది&period; అసలు యుద్ధ విరమణ ప్రతిపాదన చేయాల్సింది&comma; యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెలేనని ఇరాన్ కుండ బద్దలు కొట్టింది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు గతనెల 28à°µ తేదీ నుంచి కొనసాగుతోన్న యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం సంక్షోభం దిశగా సాగుతోంది&period; ఈ నేపథ్యంలో ఇరాన్‌పై భూతల దాడులకు అమెరికా రెడీ అవుతోందనే ప్రచారం జరుగుతోంది&period; దీనికి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది&period; తమ దేశంపై భూతల దాడులకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది&period; ఇటువంటి సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్&period;&period; యుద్ధంపై కీలక ప్రకటన చేశారు&period; తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఆయన ప్రకటన చేశారు&period; అయితే&comma; దీనిపై ఇరాన్ మాత్రం భిన్నంగా స్పందించడం గమనార్హం&period; అసలు ఎటువంటి చర్చలు జరగడం లేదని&comma; ట్రంప్‌ను నమ్మలేమని ప్రకటన చేయడంతో అసలేం జరగుతోందనే టెన్షన్ మిడిల్‌ఈస్ట్‌లో నెలకొంది&period;<&sol;p>&NewLine;<p>మరోవైపు&comma; ట్రంప్ ప్రకటన ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి&period; 110 డాలర్లకు పైగా పలికిన బ్రెంట్ క్రూడాయిల్ à°§à°° ట్రంప్ ప్రకటన తర్వాత 96 డాలర్లకు పడిపోయింది&period; ట్రంప్ ప్రకటించిన నిమిషాల్లోనే క్రూడాయిల్ 10 శాతానికి పైగా క్షీణించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.