పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది

Advertisements

<p>పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ నేపథ్యంతో భారత్ లో చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది&period; అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ యుద్ధం సుమారు నెలరోజులపాటు కొనసాగవచ్చని చెప్పడంతో&period;&period; చమురు నిల్వలపై ఆందోళన మరింత పెరిగింది&period; ప్రస్తుతం ఉన్న పెట్రోల్&comma; డీజిల్ నిల్వలు అయిపోతే ధరలు పెరుగుతాయన్న ఊహాగానాల వేళ&period;&period; ధరల పెంపుపై కేంద్రప్రభుత్వ వర్గాలు క్లారిటీ ఇచ్చాయి&period; చమురు&comma; గ్యాస్ నిల్వలపై కీలక ప్రకటన చేశాయి&period; పెట్రోల్&comma; డీజిల్ ధరలను తక్షణమే పెంచే ఆలోచన లేదని అధికారులు స్పష్టం చేశారు&period; ప్రస్తుతం దేశంలో చమురు నిల్వలు 25 రోజులకు సరిపడా ఉన్నాయని&comma; చమురు దిగుమతి కోసం ప్రత్యామ్నాయాలు చూస్తున్నామని కేంద్రవర్గాలు తెలిపాయి&period; ముఖ్యంగా LNG&comma; ఎల్ పీజీ దిగుమతుల కోసం ప్రత్యామ్నాయాలు చూస్తున్నట్లు వెల్లడించాయి&period;<&sol;p>&NewLine;<p>ఇరాన్ పై ఇజ్రాయెల్&comma; అమెరికా చేస్తున్న యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూతపడింది&period; దీంతో వేలాది చమురు షిప్పులు సముద్రంలోనే నిలిచిపోయాయి&period; జలసంధి సమీపంలో వేలాది చమురు నౌకలు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకున్నాయి&period; ఇవన్నీ ఎగుమతి కావాలంటే యుద్ధం ఆగాలి&period; అందుకు కనీసం 40 రోజులు సమయం పడుతుందని అంచనా&period; అక్కడి నుంచి చమురు రాకపోతే మనదగ్గరి నిల్వలు అయిపోతే ధరలు పెరుగుతాయన్న ఆందోళనతో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు&period; మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో నెలకొన్ని ఉద్రిక్తతల నేపథ్యంలో మనవద్ద పెట్రోల్ ధరలు పెరుగుతాయన్న వార్తల నేపథ్యంలో వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు&period; హైదరాబాద్ లో వాహనదారులు వాహనాల్లోనే కాక&period;&period; బాటిల్స్ లోనూ పెట్రోల్ ఫిల్ చేయించుకుంటున్న దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

భోజ్‎శాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

మంచిర్యాలలో పశువుల అక్రమ రవాణాపై డీసీపీ సమావేశం..

నెల్లూరు జిల్లా కావలిలో పొదుపు మంత్రం..