101
పాకిస్థాన్‌లో వరుసగా ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్నాయి. శనివారం ఉదయం పంజాబ్ ప్రావిన్స్‌లోని మియన్వాలిలోని వైమానిక స్థావరంపై ఆత్మాహుతి దాడులు జరిగాయి. ఈ పేలుళ్లు తమపనేనని తెహ్రీక్ ఇ జిహాద్ ఉగ్రసంస్థ ప్రకటించింది. ఫైటర్ జెట్లు ఉన్న స్థావరంలోకి పలువురు ఉగ్రవాదులు చొరబడినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ప్రాణనష్టం గురించిన వివరాలు తెలియాల్సి ఉంది.