నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం వివేకానంద స్కూల్ రాంభూపాల్ అనే పీటీ మాస్టర్ ఇద్దరు విద్యార్థుల వద్ద మాయమాటలు చెప్పి రెండు బంగారు చైన్లు కాజేసిన వైనం. వివరాలలోకి వెళితే బుచ్చిరెడ్డిపాలెం వివేకానంద స్కూల్లో వీటి మాస్టర్ గా పనిచేస్తున్న రాంభూపాల్ అదే స్కూల్లో చదువుతున్న ఇద్దరు విద్యార్థుల వద్ద కు వెళ్లి వేరే వాళ్ళ పెళ్లి ఉందని చైన్ కావాలని అడగగా ఇద్దరు పిల్లలు పి టి మాస్టర్ కి బంగారు చైన్ అందచేశారు. ఇద్దరు చిన్నారులను ఇంట్లో వాళ్ళు అడగగా పిటి మాస్టర్ కి ఇచ్చామని తెలపగా విద్యార్థిని తల్లిదండ్రులు పిటి మాస్టర్ ఫోన్ చేశారు. అప్పటికే ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి స్కూల్ వద్దకు వెళ్లగా పిటి మాస్టర్ సెలవులో ఉండడంతో అక్కడి నుండి రాంభూపాల్ ఇంటి వద్దకు వెళ్ళగా అప్పటికే రాంభూపాల్ పరారైన విషయం తెలిసింది. అయితే రెండు చైన్ ల విలువ రెండు లక్షల 30 వేల రూపాయల వరకు ఉంటుందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
చిన్నారులకు మాయమాటలు చెప్పిన – పీటీ మాస్టర్
134
previous post