93
ధర్మాజీ గుడెంకు చెందిన అలేఖ్య అనే మహిళ గురువారం ప్రసవం కోసం ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ అయినా సరిగా పట్టించుకోలేదని ఆరోపిస్తున్న భర్త రాజేష్. ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యానికి పురిటిలోనే బిడ్డ మృతి. వైద్యులు నార్మల్ డెలివరీ చేస్తామంటూ పురిటి నొప్పులు పడుతున్న మహిళను నిర్లక్ష్యం చేశారు. ప్రసవం సమయంలో శిశువు తల వద్ద గాయం కావడంతో శిశువు మృతి చెందింది. మృతి చెందిన శిశువును తండ్రి చేతిలో పెట్టి వేరే హాస్పటల్ తీసుకెళ్లాలని సిబ్బంది సూచించారు. వేరే హాస్పిటల్ కి వెళ్లేసరికి అప్పటికే శిశువు మృతి చెందిందని అక్కడి వైద్యులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రాజేష్ డిమాండ్.
Read Also..