126
మనలో 40 శాతం మంది ఇరిటబుల్ బొవెల్ సిండ్రోమ్‌తో బాధితులున్నారని అంచనా. దీనివల్ల విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుంటారు. దీనికి మంచి పరిష్కారాన్ని చూపేవి అతి చిన్న సూక్ష్మజీవులైన బాక్టీరియా అంటున్నారు నిపుణులు. లాక్టోబాసిల్లస్ అసిడోఫిలస్, లాక్టోకోకస్ లాక్టిస్ లాంటి మేలు చేసే ఈ బాక్టీరియా పెరుగులో పుష్కలంగా ఉంటాయి. పొట్ట ఉబ్బరాన్ని, కడుపు నొప్పిని తగ్గించడంలో ఇవి కీలకపాత్ర వహిస్తాయి. ప్రతిరోజూ ఒకటి లేదా రెండు కప్పుల పెరుగు తీసుకుంటూ ఉంటే ఐబిఎస్ నుంచి ఉపశమనం కలుగుతుంది.