జగిత్యాల జిల్లా పట్టణంలోని పొన్నాల గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గతంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు టూరిస్ట్ స్పాట్ గా మారుతోందని చెప్పానని… అదే నిజమైందని తెలిపారు. గోదావరి వరద ప్రవాహం వస్తే ఇసుక తరలి పోతుందనే పరిజ్ఞానం కేసీఆర్ కు లేదన్నారు విమర్శలు గుప్పించారు. పిల్లర్ల కింద బొగ్గు గనులున్నయని మీకు తెల్వదా..? దొరగారూ సంతకం పెట్టమంటే ఇంజనీరింగ్ ఆఫీసర్లు సంతకం పెట్టారంటూ వ్యంగ్యం చేశారు. సాంకేతికంగా పరిశీలించకుండా కాళేశ్వరంను డిజైన్ చేసినందుకు ఈఎన్సీ మురళీ ధర్ రావు ను కటకటాల్లో పెట్టాలన్నారు. కామారెడ్డిలో కేసీఆర్ పై రేవంత్ రెడ్డి పోటీకి నిలబడితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచే మొట్ట మొదటి స్థానం కామారెడ్డియే అన్నారు. కేసీఆర్ ను ఓడగొట్టే మొగుడు రేవంత్ రెడ్డి అని.. కేసీఆర్ ను ఓడగొట్టాలని ప్రజలందరూ కసితో ఉన్నరని వ్యాఖ్యానించారు. కామారెడ్డి ప్రభావం రాష్ట్రమంతా ఉంటదన్నారు.
పొన్నాల గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ సమావేశం
111
previous post