121
చింతలపూడి మండలం పాత చింతలపూడి, మల్లాయగూడెం, పోతునూరు గ్రామాలలో ఎండిపోయిన వరి పొలాలను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15 వేల ఎకరాల వరి ఆయకట్టు ఉంటే, దానిలో దాదాపు 2500 ఎకరాల నుండి మూడు వేల ఎకరాలు పంట వర్షం లేక ఎండి పోవడం జరిగింది అన్నారు. రైతులకు పంట నష్టం ఇవ్వటానికి రెండు రకాల విధానాలు ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించడం ఒక విధానం , జగనన్న ప్రవేశపెట్టిన ఈక్రాఫ్ నమోదు చేసుకున్న రైతులకు ఇన్సూరెన్స్ ద్వారా నష్ట పరిహారం ఇవ్వటం జరుగుతుందని, అధికారులు ఆ దిశగా నష్టపరిహారం అంచనాలు పంపడం జరుగుతుందని , రైతులకు నష్ట పరిహారం ఇప్పించే విధంగా నేను కూడా కృషి చేస్తానని ఆయన అన్నారు.