54
పోలీసుల అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ జిల్లా పోలీస్ శాఖ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసింది. జిల్లాలోని పోలీసులతో పాటు వివిధ ప్రాంతాల్లో ప్రజలు, విద్యార్థులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. అనంతరం రక్తదానం చేసిన పోలీసులకు ,విద్యార్థులకు, ప్రజలకు తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలను అందజేశారు.