డోర్నకల్ కాంగ్రెస్ కార్యకర్తలు లేకుంటే తనకు టికెట్ వచ్చేది కాదని , డోర్నకల్ కాంగ్రెస్ అభ్యర్ధి జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కురవి మండలకేంద్రంలోని అంబెడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ,ప్రచార రథానికి పూజలు నిర్వహించారు. అనంతరం ప్రచారాన్ని ప్రారంభించి మాట్లాడారు..అన్ని మండల,బూత్ ల, గ్రామాల నాయకులు ,మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమ కారులు కార్యకర్తలతో కలిసి అందరూ సమిష్టిగా కలిసి పనిచేయాలని ,మాలోత్ నెహ్రు నాయక్ తాము కలిసే కార్యక్రమాలలో పాల్గొంటామని అన్నారు. రాంచంద్రునాయక్ కు టికెట్ రావద్దని స్థానిక ఎమ్మెల్యే వీరభద్రస్వామి ని మొక్కుకున్నాడని ఎద్దేవా చేశారు. ఈ ఇరవై రోజులు కలిసి కట్టుగా నిద్రాహారాలు మాని పనిచేయాలని,డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు పునర్వైభవం రబోతున్నాదని,తొమ్మిదవ తారిఖు రేవంత్ రెడ్డి సారధ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని ,సోనియాకు జన్మదిన కానుకగా రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసి ఇవ్వాలని ,రెడ్యానాయక్ ఈ ఎన్నికల్లో వేసే కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. ఎన్నికల నిబంధనలను అనుసరించి మాత్రమే కార్యక్రమాలు ఉండాలని అన్నారు.
ప్రచారాన్ని ప్రారంభించిన డా.రాంచంద్రునాయక్
141
previous post