కళ్లలో రక్తస్రావం కలిగిస్తోన్న ఒక వైరల్ ఇన్ఫెక్షన్ ఫ్రాన్స్‌ను వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు ‘క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్’ అని వైద్యనిపుణులు తెలిపారు. ఇది ఒక రకం పురుగుల ద్వారా వ్యాపిస్తోందని గుర్తించారు. బాధితుల్లో కండరాల నొప్పి, గొంతులో మంట, వాంతులు, కడుపులో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ముక్కు, కళ్లు, చర్మంలోని రక్తనాళాలు పగిలి, వాటి నుంచి రక్తస్రావం జరుగుతుండవచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. జ్వరం, కళ్లు తిరగడం, మెడ, వెన్ను,తలనొప్పి, కళ్లు ఎర్రబారడం, వెలుగును చూడలేకపోవడం వంటిని కనిపిస్తున్నాయి. వ్యాధి ముదిరేకొద్ది ఈ లక్షణాలు మరింత తీవ్రమవుతున్నాయని వైద్యులు అప్రమత్తం చేశారు. కాగా ఫ్రాన్స్-స్పెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో ఈ ఇన్ఫెక్షన్ కేసులు నమోదవుతున్నాయి. కాబట్టి ఈ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లేటప్పుడు అప్రమత్తగా ఉండాలని పౌరులను ఫ్రాన్స్ హెచ్చరించింది. కాగా క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ వ్యాధి ఎబోలా వైరస్‌కు సంబంధించినదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆఫ్రికా, పశ్చిమాసియా ప్రాంతాల్లో అధికంగా కనిపిస్తుందని తెలిపారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఈ వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు ఈ వ్యాధి తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది తొలి ప్రాధాన్య వ్యాధుల్లో దీనిని కూడా చేర్చుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.
ఫ్రాన్స్‌ను వణికిస్తున్న వైరల్ ఇన్ఫెక్షన్
127
previous post