బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Bandi Sanjay

Advertisements

&NewLine;<p>తెలంగాణ బీజేపీ అగ్రనేత బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తాను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తనకు బెదిరింపులు వచ్చేవని ఆయన తెలిపారు&period; చార్మినార్ వద్ద బీజేపీ సభ పెడితే తన భార్య తలను నరికి బహుమతిగా పంపిస్తామని&comma; కొడుకులను కిడ్నాప్ చేస్తామని బెదిరించారని చెప్పారు&period; అయితే బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా పాతబస్తీలో సభను నిర్వహించామని తెలిపారు&period; భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీర్వాదంతో బీజేపీని బలోపేతం చేయడానికి ధైర్యంగా పాతబస్తీలో సభను పెట్టామని చెప్పారు&period; బెదిరింపులకు భయపడకుండా చార్మినార్ ఎదుటే సభను నిర్వహించామని తెలిపారు&period; పార్టీ కోసం తెగించి&comma; ధైర్యంగా ముందుకు వెళ్లిన చరిత్ర తమదని అన్నారు&period; గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు కూడా తన మాదిరే ఎన్నో బెదిరింపులు వచ్చాయని&period; ఆయనను చంపేస్తామని బెదిరించారని సంజయ్ తెలిపారు&period; అయినా&comma; రాజాసింగ్ భయపడకుండా హిందూ ధర్మం కోసం తన పోరాటాన్ని కొనసాగించారని చెప్పారు&period; బీజేపీకి ఏడాది పాటు దూరమైనా&period; ధర్మం కోసం పోరాడుతూనే ఉన్నారని కితాబిచ్చారు&period; బీజేపీ గెలుస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు&period; బీజేపీ గెలిస్తే బీసీ నేత సీఎం అవుతారని అన్నారు&period; ఇప్పటికే బీజేపీ నేతలంతా ప్రజల్లోకి వెళ్లారని&period; ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమయ్యారని చెప్పారు&period; రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సభలను నిర్వహిస్తామని తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.