115
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గ్రామాలపాడు గ్రామానికి చెందిన వెంకటరత్నమ్మను.. బతికుండగానే స్మశాన వాటికలో వదిలేసాడు ఆమె కుమారుడు.
నడవలేని స్థితిలో.. ఆహారం లేక అలమటిస్తున్న ఆమె దీనస్థితికి చలించిన గ్రామస్తులు.. వెంటనే స్పందించారు.
వృద్ధాప్యంలో కన్నతల్లిని సాకలేక వదిలి వెళ్ళినట్లు పోలీసులకు సమాచారం అందించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హమీ ఇచ్చారు.