129
ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగింది. బరువు తగ్గడానికి ఎక్కువ మంది గ్రీన్ టీ తీసుకుంటున్నారు.గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరాన్ని, గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయి. ప్రతిరోజు ఉదయాన్నే గ్రీన్ టీ తాగితే రోజంతా ఉత్సహంగా గడుపుతారు.గ్రీన్ టీ లో నిమ్మరసం కలిపి తీసుకోవడంవల్ల సులభంగా బరువు తగ్గుతారు. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది.మధుమేహంతో బాధపడేవారు ఒక కప్పు గ్రీన్ టీని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.. రోజుకు ఒకటి లేదంటే రెండుసార్లు మాత్రం గ్రీన్ టీని తీసుకోవాలి. అప్పుడే మంచి ఆరోగ్యం సొంతమవుతుంది.