సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించామని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. డి హిరేహాల్ మండలం సిద్దాపురం గ్రామంలో గో సిద్దేశ్వర దేవాలయన్ని సందర్శించి ప్రత్యేక పూజ నిర్వహించారు.
ప్రతి ఇంటికి వెళ్లి బాబు షూరిటి భవిష్యత్తు గ్యారెంటీ సూపర్ సిక్స్ పథకాలను ప్రతి ఇంటింటికి తిరుగుతూ చంద్రబాబు నాయుడు మహానాడులో ప్రకటించిన మినీ మేనిఫెస్టోని ప్రజలకు వివరిస్తూ “బాబు షురిటి – భవిష్యత్తు గ్యారెంటీ” పాంప్లెట్ల ను పంపిణీ చేశారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కక్షపూరిత రాజకీయాలను అక్రమాలను అన్యాయాలను ప్రజలకు వివరిస్తూ తెలుగుదేశం పార్టీ గతంలో చేసిన అభివృద్ధి సంక్షేమాలను వివరించారు. అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా భావించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిన టిడిపి నేత చంద్రబాబు నాయుడు కేవలం కక్షపూరితంగా అక్రమంగా జైల్లో పెట్టారని ఆవేదన చెందారు.
తెదేపా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ అభివృద్ధి బాటలో నడిపించేందుకు కృషి చేస్తామన్నారు. ప్రతి ఇంటిలోనూ చదువుకున్న ప్రతి విద్యార్థుల కి 15000 రూపాయలు, మహాశక్తి పేరు తో మహిళలకు అనేక పథకాలు, సంవత్సరానికి మూడు సిలిండర్ అందిస్తామని హామీ ఇచ్చారు, ఇలా సూపర్ సిక్స్ పథకాలు ఇవ్వడం జరుగుతుందని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
బాబు షురిటి – భవిష్యత్తు గ్యారెంటీ
126
previous post