అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గం, బ్రహ్మసముద్రం మండలం పాలవెంకటపురం గ్రామంలో బాబు షూరిటీ-భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రతి ఇల్లు తిరిగి చంద్రబాబు ఆవిష్కరించిన సూపర్ సిక్స్ లో బాగంగా మహిళలకు రైతులకు వివరించడం జరిగింది. అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన మాట్లాడుతూ ఈ రోజు ఏ గ్రామంలో చూసిన అభివృద్ధి కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్న ఘనత చంద్రబాబు నాయుడి కృషే అన్నారు. అందుకోసమే చంద్రబాబు నాయుడు కు గ్రామాల్లో ప్రజా ఆదరణ పెరుగుతోందన్నారు. మనం అందరం సమిష్టి కృషితో టీడీపీ విజయానికి కృషి చేస్తూ, సీఎం గా చంద్రబాబు నాయుడు ను గెలిపిద్దామంటూ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
బాబు షూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ
117
previous post