వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం, ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో, విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. తాజాగా పురందేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారని అన్నారు.ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి, ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? అని పురందేశ్వరిని సూటిగా ప్రశ్నించారు. ఈ విషయంలో మీ నిజాయతీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలంటూ సవాల్ విసిరారు. మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర మీ కుటుంబ సభ్యులు ముడుపులు తీసుకున్నారని అన్నారు.హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారని, ఆ విల్లాకు సొమ్ము ఎవరు ఇస్తున్నారంటూ పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
బీజేపీపై మరోసారి ఫైర్ – విజయసాయి రెడ్డి
132
previous post