బీజేపీపై మరోసారి ఫైర్ – విజయసాయి రెడ్డి

Vijayasai Reddy

Advertisements

&NewLine;<p>వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి ఏపీ బీజేపీ ఛీఫ్ పురందేశ్వరిపై మరోసారి ఫైర్ అయ్యారు&period; చంద్రబాబు అరెస్ట్ ను ఖండించడం&comma; ఏపీలో లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరడం వంటి అంశాల నేపథ్యంలో&comma; విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు&period; తాజాగా పురందేశ్వరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు&period; పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలో చేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారని అన్నారు&period;ఎయిరిండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి&comma; ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తిత్వం చేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా&quest; అని పురందేశ్వరిని సూటిగా ప్రశ్నించారు&period; ఈ విషయంలో మీ నిజాయతీని నిరూపించుకోవడానికి సీబీఐ విచారణకు సిద్ధమేనా&quest; ఆ మేరకు కేంద్రానికి లేఖ రాయాలంటూ సవాల్ విసిరారు&period; మద్యం సిండికేట్ బ్రోకర్ల దగ్గర మీ కుటుంబ సభ్యులు ముడుపులు తీసుకున్నారని అన్నారు&period;హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో అత్యంత ఖరీదైన విల్లాను ఎలా నిర్మిస్తున్నారని&comma; ఆ విల్లాకు సొమ్ము ఎవరు ఇస్తున్నారంటూ పురందేశ్వరిపై విజయసాయిరెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మున్సిపల్ కమిషనర్, వైకాపా నాయకుల మధ్య భారీ వాగ్వాదం..

వరంగల్‌లో డీఆర్‌ఐ అధికారుల సంచలన ఆపరేషన్..

పుట్టపర్తిలో పర్యావరణ హితంగా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సరికొత్త ముందడుగు..