నిరుద్యోగ తమ్ముళ్లారా…… కేసీఆర్ రాక్షస పాలనలో మీరు పడ్డ గోసలు ఈ 23 రోజులు గుర్తుచేసుకోండి. మీ కుటుంబాలు పడుతున్న బాధలను యాది చేసుకోండి. 9 ఏళ్లుగా ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా జాబ్ క్యాలెండర్ అంటూ మభ్యపెడుతున్న దండుపాళ్యం ముఠా మాటలు నమ్మకండి. అట్లాగే మీకోసం యుద్దం చేసిన బీజేపీని గుర్తుంచుకోండి. రాబోయే ఎన్నికల్లో మీరిచ్చే తీర్పుతో బీఆర్ఎస్ నేతల మైండ్ బ్లాంక్ కావాలె…. అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ యువకులకు పిలుపునిచ్చారు. ఇచ్చిన మాట మేరకు బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడంతోపాటు ఏటా జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. వయోపరిమితిని సడలించి నిరుద్యోగులకు జరిగిన నష్టాన్ని పూడుస్తామన్నారు. బీసీ నాయకుడే సీఎం అవుతారని ఉద్ఘాటించారు. కేసీఆర్ కు దమ్ముంటే… ఆయన రాజకీయ వారసుడెవరో ఎన్నికల తరువాత ఎవరిని సీఎం చేస్తారో ప్రకటించాలని సవాల్ విసిరారు.
బీజేపీ అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు..
88
previous post