భారత్ ,ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల మధ్య ట్విట్టర్ వార్

England and India cricket fans

Advertisements

&NewLine;<p>ప్రపంచకప్ సమయంలో క్రికెట్ అభిమానుల మధ్య మాటల యుద్ధాలు సాధారణంగానే కనిపిస్తుంటాయి&period; ఈ విడత కూడా ఇలాంటివి కొన్ని చోటు చేసుకుంటున్నాయి&period; భారత్-ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ సందర్భంగా ఇరు దేశాల క్రికెట్ అభిమానుల మధ్య ట్విట్టర్ లో ట్వీట్ల పోరు కనిపించింది&period; ఇంగ్లండ్ క్రికెట్ అభిమానుల సంఘం &OpenCurlyQuote;బార్మీ ఆర్మీ’ భారత క్రికెటర్ల పట్ల ఎప్పుడూ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంటుంది&period; మరోసారి బార్మీ ఆర్మీ తన అసలు రూపాన్ని చూపించింది&period; టాస్ ఓడి భారత్ బ్యాటింగ్ కు దిగగా&comma; ఇంగ్లండ్ బౌలర్లు 229 పరుగులకు భారత్ ను కట్టడి చేశారు&period; ముఖ్యంగా వన్డే ప్రపంచకప్ 2023లో ఇప్పటి వరకు అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్న విరాట్ కోహ్లీ ఇంగ్లండ్ తో మ్యాచ్ లో తేలిపోయాడు&period; సున్నా పరుగులకే డకౌట్ అయ్యాడు&period; దీన్ని బార్మీ ఆర్మీ ఎగతాళి చేసింది&period; నీటిలో ఉన్న రెండు డక్స్ ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది&period; అందులో ఒక బాతు తలకాయకు కోహ్లీ తలను తగిలించింది&period; మార్నింగ్ వాక్ కు వెళ్లిందంటూ క్యాప్షన్ పెట్టేసింది&period; దీనిపై భారత అభిమానులకు చిర్రెత్తుకొచ్చింది&period; &OpenCurlyQuote;&OpenCurlyQuote;ఎడిట్ చేయడానికి మాకు కొంత సమయం ఇవ్వు’’అని బదులిచ్చింది&period; కోహ్లీ తల స్థానంలో బెన్ స్టోక్స్ తలను అతికించి ఇమేజ్ పోస్ట్ చేసింది&period; భారత బ్యాటింగ్ ముగిశాక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ మొదలైంది&period; భారత బౌలర్లు ఇంగ్లండ్ ఆటగాళ్లను బెంబేలెత్తించారు&period; కేవలం 129 పరుగులకే ఇంగ్లండ్ ను ఆల్ అవుట్ చేశారు&period; అప్పుడు &OpenCurlyQuote;&OpenCurlyQuote;సాయంత్రం నడకకు వెళ్లింది’’ అంటూ భారత్ ఆర్మీ పేరుతో భారత అభిమానుల సంఘం రిప్లయ్ ఇచ్చింది&period; ఈ విడత నీటిలో ఉన్న ఒక బాతు తలకు డకౌట్ అయిన జోరూట్ తలను తగిలించింది&period; టీమిండియా వైపు నుంచి ఒక్క కోహ్లీయే డకౌట్ కాగా&comma; దీన్ని బార్మీ ఆర్మీ అవకాశంగా తీసుకుంది&period; ఇంగ్లండ్ వైపు నుంచి డకౌట్ అయిన స్టోక్స్&comma; రూట్ చిత్రాలను ఉపయోగించి నోరు పెగల్లేని విధంగా భారత్ ఆర్మీ బదులిచ్చింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

‘మన డాక్టర్ బాబే’ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను – టీజర్ లాంచ్ ఈవెంట్‌లో వీఎన్ ఆదిత్య..

ఐపీఎల్‌ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధం..

కృష్ణా జిల్లాలో ఆక్రమణకు గురవుతున్న సముద్ర తీరం..