వీసాల జారీలో రికార్డు

bharat and america

Advertisements

&NewLine;<p>భారత్ లోని అమెరికా రాయబార కార్యాలయం వీసాల జారీలో రికార్డు సృష్టించింది&period; 2023లో ఇప్పటివరకు 10 లక్షలకు పైగా వీసాలు జారీ చేసింది&period; గతంలో ఓ ఏడాది కాలంలో అమెరికా ఎంబసీ ఎప్పుడూ ఇన్ని వీసాలు జారీ చేయలేదు&period; ఇప్పుడు కొన్ని నెలల వ్యవధిలోనే ఏకంగా ఒక మిలియన్ వీసాలు జారీ చేసింది&period; ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అమెరికా జారీ చేసిన వీసాల్లో 10 శాతం భారతీయులకే కేటాయించారు&period;ఈ ఘనత పట్ల అమెరికా రాయబార కార్యాలయం హర్షం వ్యక్తం చేసింది&period; మిషన్ వన్ మిలియన్ పూర్తయిందని తన సోషల్ మీడియా ఖాతాలో సగర్వంగా ప్రకటించింది&period; ఇది ఇంతటితో ఆగదని&comma; రాబోయే కాలంలో మరింత మంది భారతీయులకు అమెరికా వెళ్లే అవకాశం కల్పిస్తామని వెల్లడించింది&period; వీసాల జారీలో మరింత వృద్ధి సాధిస్తామని అమెరికా ఎంబసీ పేర్కొంది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వరుస చైన్ స్నాచింగ్ కేసులను ఛేదించిన భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు.

రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన మహేష్‌ కుమార్ గౌడ్.

ఈ నెల 25న రాయదుర్గంలో నారా లోకేష్ పర్యటన.