భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్రను తిరగరాసింది.

Advertisements

<p>ధనాధన్‌ క్రికెట్‌ పండుగ ముగిసింది&period; కోట్లాది మంది భారతీయుల కల నెరవేరింది&period; నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా టీమ్‌ఇండియా మరోసారి విశ్వవిజేతగా నిలిచింది&period; ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన సూర్యకుమార్ సేన&comma; ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2026 ట్రోఫీని సగర్వంగా ముద్దాడింది&period; తద్వారా 2024లో సాధించిన టైటిల్‌ను నిలబెట్టుకుని&comma; పొట్టి ఫార్మాట్‌లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది&period; తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 255 భారీ స్కోరు సాధించింది&period; ఓపెనర్లు అభిషేక్ శర్మ&comma; సంజు శాంసన్&comma; అదిరిపోయే ఆరంభాన్ని ఇవ్వగా&comma; ఇషాన్ కిషన్ అర్థ శతకంతో చివర్లో హార్దిక్ పాండ్య&comma; శివమ్ దూబే మెరుపులు మెరిపించారు&period; అనంతరం లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు&period; జస్‌ప్రీత్ బుమ్రా తన పదునైన బంతులతో&comma; అక్షర పటేల్ తన స్పిన్ మాయాజాలంతో కివీస్ నడ్డి విరవగా&comma; కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టారు&period; 2024 తర్వాత వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది&period;<br &sol;>&NewLine;సూర్యకుమార్ యాదవ్ తన కెప్టెన్సీలో భారత్‌కు తొలి మేజర్ ఐసీసీ ట్రోఫీని అందించారు&period; ఫైనల్ మ్యాచ్‌లో యువ బ్యాటర్ అభిషేక్ శర్మ&comma; సంజు శాంసన్&comma; ఇషాన్ కిషన్ మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నారు&period;<br &sol;>&NewLine;ఈ విజయంపై దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి&period; పలువురు ప్రముఖులు టీమ్‌ఇండియాకు అభినందనలు తెలిపారు&period; &&num;8220&semi;ఇది భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం&&num;8221&semi; అని క్రీడా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు&period;<&sol;p>&NewLine;<p>భారత క్రికెట్ జట్టు మరోసారి చరిత్రను తిరగరాసింది&period; గుజరాత్‌లోని అహ్మదాబాద్&comma; నరేంద్ర మోడీ స్టేడియంలో లక్షలాది మంది అభిమానుల జయజయధ్వానాల మధ్య భారత్ ప్రపంచ క్రికెట్ శిఖరాన్ని అధిరోహించింది&period; ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం సాధించి&comma; విశ్వవిజేతగా నిలిచింది&period; వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ భారత్‌కు దక్కడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేశారు&period; మొత్తంగా భారత్‌ మూడు టీ20 ప్రపంచకప్‌లు సాధించడం గమనార్హం&period;<&sol;p>&NewLine;<p>టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్ సంజూ శాంసన్ వీరోచిత ప్రదర్శన చేశారు&period; 46 బంతుల్లో 89 పరుగులు చేశారు&period; ఆ తర్వాత అభిషేక్&comma; ఇషాన్‌ కిషన్ కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు&period; మొత్తంగా నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 256 పరుగుల భారీ స్కోరు సాధించింది&period; కివీస్ బౌలర్లలో నీషమ్ మూడు&comma; రచిన్ రవీంద్ర&comma; హెన్రీ ఒక వికెట్ తీశారు&period;<&sol;p>&NewLine;<p>భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు&period; జస్ప్రీత్ బుమ్రా&comma; అక్షర్ పటేల్ తమ పదునైన బౌలింగ్‌తో ఆరంభంలోనే వికెట్లు తీశారు&period; ఒత్తిడిలో వరుసగా వికెట్లు కోల్పోయిన న్యూజిలాండ్&comma; భారత బౌలింగ్ ధాటికి నిలవలేక ఓటమిని అంగీకరించింది&period; న్యూజిలాండ్ బ్యాటర్లలో సీఫెర్ట్ &lpar;52&rpar;&comma; కెప్టెన్ శాంట్నర్ &lpar;43&rpar; తప్ప ఎవరూ రాణించలేదు&period; మొత్తంగా 19 ఓవర్లలో 159 పరుగులు చేసి న్యూజిలాండ్ జట్టు ఆలౌట్ అయింది&period; భారత బౌలర్లలో బూమ్రా నాలుగు&comma; అక్షర్ మూడు&comma; వరుణ్&comma; హార్దిక్&comma; అభిషేక్ తలో వికెట్ తీశారు&period;<&sol;p>&NewLine;<p>విజయం ఖరారైన క్షణంలో స్టేడియం మొత్తం బాణసంచా వెలుగులతో&comma; &&num;8216&semi;చక్ దే ఇండియా&&num;8217&semi; నినాదాలతో హోరెత్తిపోయింది&period; రోహిత్ శర్మ నుండి సారథ్య బాధ్యతలు స్నేహపూర్వకంగా అందుకున్న సూర్యకుమార్ యాదవ్&comma; తన మొదటి మేజర్ టోర్నీలోనే జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టి రికార్డు సృష్టించారు&period; &&num;8220&semi;ఇది జట్టు సమిష్టి కృషి&period; ఆటగాళ్లకు ఇచ్చిన స్వేచ్ఛే ఈ రోజు మమ్మల్ని ఈ స్థాయిలో నిలబెట్టింది&period; ఈ కప్పు దేశ ప్రజలందరికీ అంకితం&&num;8221&semi; అని గెలుపు అనంతరం భావోద్వేగంతో కెప్టెన్ సూర్య వ్యాఖ్యానించారు&period; ఈ విజయంతో భారత్ మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకుని&comma; పొట్టి ఫార్మాట్‌లో తమ ఆధిపత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది&period;<&sol;p>&NewLine;<p>డిఫెండింగ్ ఛాంపియన్‌ టీమ్‌ఇండియా మూడోసారి ట్రోఫీని దక్కించుకొని చరిత్ర సృష్టించింది&period; మరే జట్టు కూడా మూడు టైటిళ్లను గెలుచుకోలేదు&period; ఎంఎస్ ధోనీ&comma; రోహిత్ శర్మ తర్వాత భారత్‌కు కప్ అందించిన సారథిగా సూర్యకుమార్‌ యాదవ్ నిలిచాడు&period; ఆతిథ్య జట్టు స్వదేశంలో ట్రోఫీ గెలవడం ఇదే మొదటిసారి కావడం విశేషం&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

శ్రీలంక Aకి రెండు పాయింట్లు, ఫైనల్స్ దిశగా మరో అడుగు.

విమానంలో క్రికెట్‌ ఆడిన సచిన్ టెండూల్కర్‌

ఇంగ్లాండ్ మహిళల జట్టు ఘన విజయం – టోర్నమెంట్‌లో బలమైన ఆరంభం.