భారీ దొంగతనం..పట్టుబడ్డ నిందితులు..

highly amount theft

Advertisements

&NewLine;<p>పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గత నెలలో జరిగిన భారీ దొంగతనం కేసును పోలీసులు చేదించారు&period; కేసుకు సంబంధించి ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేసి వారి నుంచి సుమారు 9 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు&period; కేసు వివరాలను జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ మీడియాకి తెలిపారు&period; తణుకు పట్టణానికి చెందిన బంగారు వ్యాపారి ఇంట్లో గత నెల 12వ తేదీన ఐదుగురు దుండగులు చొరబడి వ్యాపారితో సహా కుటుంబ సభ్యులందరినీ తాళ్లతో బంధించి చోరీకి పాల్పడ్డారు&period; వ్యాపారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు&period; రాష్ట్ర పోలీస్ అధికారులు ఆదేశాల మేరకు జిల్లా అధికారుల సూచనలతో తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన పోలీసులు దర్యాప్తులో పాల్గొన్నారు&period; మహారాష్ట్రకు చెందిన నిందితులు ఇటువంటి చోరీలకు పాల్పడతాయని తెలిసి పోలీస్ బృందాలు మహారాష్ట్ర తరలి వెళ్లాయి&period; ఐదు రోజులపాటు మహారాష్ట్రలో పోలీసులు విచారించి అసలు నిందితులను పట్టుకున్నారు&period; నిందితుల్లో ప్రధానమైన జతిన్ అనే వ్యక్తి చాలా చోరీల్లో ఆరితేరిన వ్యక్తి అని గుర్తించారు&period; అతనితోపాటు సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి సుమారు ఐదు కోట్ల రూపాయలు పైగా విలువైన 9 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు&period; కేసు పూర్వపరాలను వివరించిన జిల్లా ఎస్పీ రవి ప్రకాష్ నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామన్నారు&period; వీరిద్దరికీ సహకరించిన మరో ముగ్గురిని గతంలోనే అరెస్టు చేసినట్లు వివరించారు&period; తణుకు పరిసర ప్రాంతాలకు చెందిన పోలీసులు దర్యాప్తునకు మహారాష్ట్రకు చెందిన పోలీస్ అధికారులు కూడా సహకరించారని చెప్పారు&period; వీరందరితోపాటు ఫిర్యాదుదారుడైన బంగారం దుకాణం యజమాని సహకారం కూడా తీసుకొని కేసును చేదించగలిగామని ఎస్పీ రవి ప్రకాష్ వెల్లడించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తిరుపతి జిల్లా అరిగిరివారిపల్లి పాఠశాల వద్ద గ్రామస్తుల ఆందోళన.

అనంతపురం జిల్లాలో 30 ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం.

రాయలసీమ వర్సిటీ విద్యార్థి నేతల డిస్మిస్‌పై ఆందోళన.