మంచిర్యాల జిల్లా లో నామినేషన్ల రగడ చోటుచేసుకుంది. నామినేషన్ వేసే సమయం లో ఇద్దరు అభ్యర్థులు ఒకే సమయానికి రావటంతో కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. చెన్నూర్ స్థానానికి నామినేషన్ వేసేందుకు తహసీల్దారు ఆఫీసుకు బీఆర్ఎస్ అభ్యర్థి బాల్కసుమన్, కాంగ్రెస్ అభ్యర్ధి వివేక్ వెంకటస్వామి లు ఒకేసారి వచ్చారు. అయితే 500 మీటర్ల దూరంలో వివేక్ వాహనాన్ని పోలీసుల నిలిపివేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ వాహనానికి పోలీసులు అనుమతిచ్చారు. అయితే ఇద్దరూ ఒకే సమయానికి రావడంతో ఇరుపార్టీల నినాదాలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. రెండు గ్రూపులను పోలీసులు శాంతింపజేశారు. పోలీసుల తీరుపై వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. అధికారులు రూల్స్ యధేచ్చగా అతిక్రమిస్తున్నారని ఆగ్రహాం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ నేతల దౌర్జన్యాన్ని ప్రజలు గమనించాలని కోరారు.
మంచిర్యాల జిల్లాలో నామినేషన్ల రగడ..
134
previous post