120
ఒకప్పుడు మజ్జిగ లేకుండా భోజనం ముగిసేది కాదు. ఎక్కువ స్పైసీ ఫుడ్ తిన్నా, ఎక్కువ ఫ్రై చేసినవి తిన్నా, అసలు ఏమి తినకున్నా… ఏసిడిటీ సమస్య వస్తుంది. దీనికి సరైన మందు మజ్జిగే. రోస్టెడ్ జీరా పౌడర్ చేసి పెట్టుకుని మజ్జిగలో ఒక పావు చెంచా కలిపి తాగితే… కడుపులో ఏసీడీటీ నొప్పి పోతుంది. మాములుగా ఉన్నపుడు తాగినా మంచిదే. శరీరాన్ని చల్లగా చేస్తుంది. తరచూ ఓ గ్లాసు మజ్జిగ లో జీరా కలుపుకొని తాగితే … క్రమంగా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. హార్ట్ ఎటాక్ రిస్క్ తగ్గిస్తుంది. ఆహారం సరిగా జీర్ణం కానపుడు జీలకర్ర పొడి, మజ్జిగలో కలిపి తాగాలి. తద్వారా జీర్ణవ్యవస్థ మెరుగవుతుంది. మలబద్ధకం ఉన్నవారు మజ్జిగ లో జీరా కలిపి తాగితూ ఉంటె క్రమంగా ఉపశమనం కలుగుతుంది.