మద్యం కుంభకోణంలో మరో అరెస్టు..

Advertisements

<p>మద్యం కుంభకోణంలో మరో అరెస్టు&period;&period; లిక్కర్‌ కంపెనీల ద్వారా వసూలుచేసిన నోట్ల కట్టలకు కాపలాదారుగా వ్యవహరించిన వ్యక్తిని సిట్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు&period; డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రామచంద్రపురానికి చెందిన కట్టా ప్రణయ్‌ ప్రకాశ్‌ను సోమవారం నేపాల్‌ సరిహద్దుల్లో అరెస్టు చేశారు&period; అతడిని ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్‌ న్యాయస్థానంలో హాజరుపరిచారు&period; అక్కడి నుంచి ట్రాన్సిట్‌ వారెంట్‌పై విజయవాడకు తీసుకొస్తున్నారు&period; ఏసీబీ కోర్టులో మంగళవారం హాజరుపరుస్తారు&period; ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి తోడల్లుడు ముప్పిడి అవినాశ్‌రెడ్డికి ప్రణయ్‌ ప్రకాశ్‌ అనుచరుడు&period; ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశాడు&period; మద్యం కంపెనీల నుంచి లిక్కర్‌ గ్యాంగ్‌ వసూలు చేసిన డబ్బును తాడేపల్లిలోని ల్యాండ్‌మార్క్‌ అపార్టుమెంట్‌లోని ఫ్లాట్‌లో భద్రపరిచారు&period; వసూలుచేసిన డబ్బుకు ఇది డెన్‌గా ఉండేది&period; ఇక్కడి నుంచి రాష్ట్రంలోని వివిధ నియోజకవర్గాలకు డబ్బును ఎన్నికల సమయంలో పంపారు&period;<&sol;p>&NewLine;<p>ఈ డెన్‌ను ప్రణయ్‌ ప్రకాశ్‌ నిర్వహించేవాడు&period; మరో నిందితుడు కిరణ్‌కుమార్‌కు ఇతడు స్నేహితుడు&period; డెన్‌లో ఉన్న డబ్బును చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పిన నియోజకవర్గాలకు పంపేవాడు&period; ఏ నియోజకవర్గానికి ఎంత మొత్తం పంపాలో దిశానిర్దేశం చేసేవాడు&period; రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ప్రణయ్‌ దుబాయ్‌ పారిపోయాడు&period; అక్కడ ఉక్కు కర్మాగారం స్థాపించడానికి డీపీఆర్‌ తయారు చేశాడు&period; చెవిరెడ్డి ఆదేశాలతోనే ఇది జరిగినట్లు తెలుస్తోంది&period; మద్యం కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేశాక దుబాయ్‌ నుంచి ప్రణయ్‌ను సిట్‌ అధికారులు పిలిపించారు&period; వారడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చాడు&period; న్యాయస్థానంలో వాంగ్మూలం కూడా ఇచ్చాడు&period; ఆ తర్వాతి నుంచి విచారణ గైర్హాజరయ్యాడు&period; చెవిరెడ్డితో టాంజానియాలో సమావేశమై ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టడం కోసం ప్రయాణాలు చేశాడు&period; సిట్‌ అధికారుల నుంచి తప్పించుకోవడానికి థాయ్‌లాండ్‌&comma; టాంజానియా&comma; జింబాబ్వేల్లో తిరిగాడు&period; తర్వాత ఎక్కడికో పారిపోయాడు&period; తాజాగా నేపాల్‌ సరిహద్దుల్లో ప్రణయ్‌ ప్రకాశ్‌ ఉన్నట్లు గుర్తించిన సిట్‌ అధికారులు అతడి చేతులకు సంకెళ్లు వేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

రాజాంలో ఘోర కలకలం.. తల్లినే చంపిన కొడుకు..

గన్నవరం హైవేపై ‘సేల్స్ టాక్స్’ హల్‌చల్..

విశాఖ అక్కయ్యపాలెం హత్యకేసులో పురోగతి ..